చరిత్ర సృష్టిస్తా అక్బర్ ను ఓడిస్తా….షెహజాది !

  • అక్బరుద్దీన్ ని ఓడించడమే తన లక్ష్యం అంటున్న షెహజాది…
  • ఎవరు ఈ షహజాది ?
  • భాజపా వ్యూహం…

హైదరాబాద్: మజ్లిస్ పార్టీని దెబ్బతీసేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోందని తెలుస్తున్నది.అందులో భాగంగా బీజేపీ కొత్త ప్లాన్ వేసింది.గతం లోకి వెళ్లి చూస్తే ప్రతిసారి లోకసభ ఎన్నికల్లో హైదరాబాద్ లోకసభ నియోజకవర్గంలో  మజ్లిస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోటీతో తలపడుతూనే వస్తున్న సంగతి తెలిసిందే. అయితే గత ఎన్నికల్లో మజ్లిస్ అధ్యక్షులు అసదుద్దీన్ భారీ మెజార్టీతో గెలిచిన సంగతి తెలిసిందే.  అయితే ఓటింగ్ సమయంలో ఓ దశలో బీజేపీ గెలుస్తుందేమో అనే చర్చ కూడా సాగింది. చివరకు అసదుద్దీన్ రెండు లక్షల పైచిలుకు ఓట్లతో గెలిచారు.

ఇది ఇలాగ ఉండగా హైదరాబాడు నగరం లో చూస్తే ఓల్డ్ సిటీ అదే పాతబస్తీలో నాటి నుండే  బీజేపీ, మజ్లిస్ పార్టీల మధ్య హోరాహోరీగ పోటి నెలకొంటూ వస్తుంది. అయితే గత కొంతకాలంగా మజ్లిస్ అక్కడ గెలుస్తూ వస్తోంది. బీజేపీ ఇక్కడ పట్టు కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ కీలక నేతపై బీజేపీ దృష్టి సారించింది. అయితే ఈ నేపధ్యం లో అక్బరుద్దీన్ ఓవైసీ పోటీ చేసే చాంద్రాయణగుట్ట నుంచి బీజేపీ తరఫున ఓ ముస్లీం యువతిని బరిలోకి దించనున్నాడా అంటే అవును అనే సంకేతాలు కనపడుతున్నవి.

సయ్యద్ షెహజాదీ ఎవరు ఆవిడ ?

ఎవరో కాదు మన తెలంగాణ ఆడబిడ్డే,అభ్యుదయ భావాలు గల ఓ సెక్యులర్ మహిళా సయ్యద్ షెహజాదీ. ఆమె అదిలాబాద్‌కు చెందిన ఏబీవీపీ నాయకురాలుగా అలాగే గతంలో బీజేపీ కార్యవర్గ సభ్యురాలిగా పని చేశారు. ఇటీవలే ఆమె తెలంగాణ బీజేపీ అధ్యక్షులు డాక్టర్ కే లక్ష్మణ్ ఆధ్వర్యంలో కమలం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆమె కొన్నేళ్ల పాటు ఏబీవీపీలో కీలకంగా పని చేశారు. అదిలాబాద్ మహిళా కళాశాల ఏబీవీపీ అధ్యక్షురాలిగా పని చేశారు. పట్టణ సంయుక్త కార్యదర్శిగా, జిల్లా ఏబీవీపీ మహిళా సెల్ కన్వీనర్‌గా, రెండుసార్లు రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా పని చేసిన అనుభవం ఉంది.

Please follow and like us:

You may also like...