చంద్రబాబుపై కేసీఆర్ విమర్శలకు వీహెచ్ కౌంటర్….!

జోగులాంబ: టీఆర్ఎస్ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ తదైన శైలిలో విమర్శలు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు కోట్లు ఇస్తున్నాడు, మూడు హెలికాఫ్టర్లు ఇచ్చాడని దుష్ప్రచారం చేస్తున్నారని కేసీఆర్‌పై మండిపడ్డారు. జిల్లాలో ప్రచారానికి తాము ఒక హెలికాఫ్టర్‌లోనే వచ్చామని.. మూడు ఎక్కడున్నాయో చెప్పాలని ప్రశ్నించారు. తెలివి కేసీఆర్ ఒక్కడికే లేదని.. తమకూ ఉందన్నారు. శత్రువుకు, శత్రువు మిత్రుడన్న రీతిలో టీడీపీతో కలిసి పనిచేస్తున్నామన్నారు. కేసీఆర్ అబద్ధాలపైనే ప్రచారం చేస్తామన్నారు వీహెచ్. తన ప్రచార రథం ‘ఇందిరా విజయ్ రథం’ రెడీ అయ్యిందని.. అదెక్కి ఊరూరా ప్రచారం చేస్తా అన్నారు. దేశంలో ఎక్కడికి వెళ్లినా ఇందిరమ్మను గుర్తుపడతారాని.. చౌరాస్తాలో నిలుచుంటే హనుమంతన్న బండి అంటూ పరిగెత్తుకొస్తారని చెప్పారు. శివయ్య, జోగులాంబ తల్లి ఆశీర్వాదాల కోసమే జోగులాంబ జిల్లా నుంచి కాంగ్రెస్ ప్రచారం ప్రారంభించామని తెలిపారు. ఓ టీవీ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వీహెచ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Please follow and like us:

You may also like...