ఘనంగా భగత్ సింగ్ జయంతి వేడుకలు..!

గొల్లపల్లి: గొల్లపెల్లి మండల కేంద్రంలో బీసీ విద్యార్ధి సంఘము ఆధ్వర్యం లో భగత్ సింగ్ 111వ జయంతి వేడుకలు ఘనం గా జరిపారు. ఈ సందర్భంగా బిసి విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పుప్పాల మహిపాల్ మాట్లాడుతూ భగత్ సింగ్ భారత దేశం కోసం ఎంతో పోరాడారని, ఆయన విప్లవం వర్ధిల్లాలి అనే నినాదాన్ని ఇచ్చారని ఈ సందర్బంగా గుర్తు చేసుకున్నారు. భారత దేశం కోసం బ్రిటిష్ వాళ్లను ఎదిరించిన గొప్ప వ్యక్తి అన్నారు .ఈ కార్యక్రమంలో పద్మశాలి యువజన సంఘం పట్టణ అధ్యక్షుడు అంకం సతీష్ ,సజ్జనపు రవి ,అంకం సురేష్ ,మహేష్, రఘు, శేఖర్, నాగరాజు, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Please follow and like us:

You may also like...