గినియాలో భారీ భూకంపం…!

దాచిన చిత్రం

సిడ్నీ / పపువా ఐలాండ్ :  న్యూబ్రిటన్ ఐస్‌లాండ్ పపువా న్యూగినియాలో గురువారం భారీ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్ పైన 7గా నమోదయింది. భారీ భూకంపంతో పాటు వాతావరణ శాఖ అధికారులు సునామీ హెచ్చరికలు కూడా జారీ చేశారు. భారీ సునామీ రావొచ్చునని పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం తెలిపింది. పీఎన్‌జీ, సోలోమోన్ ఐస్‌ల్యాండ్ తదితర ప్రాంతాల్లో సునామీ అలలు దాదాపు 0.3 మీటర్ల ఎత్తుకు అంటే ఒక అడుగు ఎగిసిపడే అవకాశముందని తెలిపారు. భూకంపానికి సంబంధించి నష్టం గురించి అప్పుడే తెలియరాలేదని ఓ అధికారి తెలిపారు.
భూకంప కేంద్రం న్యూబ్రిటన్‌లోని ఐస్‌లాండ్‌లో గల కింబే నుంచి 125 కిలో మీటర్ల దూరంలో ఉన్నట్లు గుర్తించారు. 40 కిలో మీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని తెలిపారు. భూకంపం రావడానికి ముందు, వచ్చిన తర్వాత రెండుసార్లు చిన్నపాటి ప్రకంపనలు కూడా వచ్చాయి.

Please follow and like us:

You may also like...