గల్ఫ్ కార్మికులకు అండగా నంగి…

యూఏఈ/షార్జా:షార్జా నంబర్ త్రీ ఇండస్ట్రియల్ ఏరియాలొ రెగ్యులర్ కల్లివెల్లి కార్మికులను కాంగ్రెస్ పార్టీ టిపిసిసి గల్ప్ ఎన్నారై సెల్ కన్వీనర్ నంగి దేవేందర్ రెడ్డి కలిసి వాళ్ళకి భరోసానిచ్చి, కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం వెంటనే ఇల్లీగల్ గా ఉన్నటువంటి 10వేల మంది కార్మికులకు గాను 50 కోట్ల రూపాయలను దుబాయి ఆమ్మేష్టి కి ప్రత్యేకమైన నిధిని కేటాయించాలని వారు డిమాండ్ చేశారు.ఈ సందర్బంగా నంగి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం తలలు వంచి అయినా సరే విమానం టికెట్లు ఏర్పాటు చేస్తామని వారు భరోసాను ఇచ్చారు.

ఇండియన్ కాన్సులేట్ కి వెళ్లి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ జస్పాల్ అహుజా ను ని కలిసి ఆమ్మేష్టి సంబంధించి కార్మికుల వివరాలు వివరించినట్లు నంగి ఓ ప్రకటనలో తెలిపినారు.

ఈద్ సందర్భంగా వన్ వీక్ హాలిడేస్ ఉన్నప్పటికీ కాన్సులేట్ మాత్రం వర్క్ చేస్తుందని మంగళవారం మాత్రమే హాలిడే వుంటుందని నంగి దేవేందర్ రెడ్డి కార్మికులకు తెలియజేశారు. 
ఈ కార్యక్రమంలో గుండెలి నరసింహులు పాల్గొన్నారు

Please follow and like us:

You may also like...