గద్దర్ మా ముఖ్యమంత్రి అభ్యర్థి…

హైదరాబాదు : రాబోయే ఎన్నికలలో ప్రజా గాయకుడు గద్దర్ ను ముఖ్యమంత్రి అభ్యర్ధిగా , మరో గాయని ,ఉద్యమకారిణి విమలక్కను ఉప ముఖ్యమంత్రిగా ప్రతిపాదిస్తున్నామని టి.మాస్ సంస్థ అద్యక్షుడు కంచ ఐలయ్య చెప్పారు. మరో ఇరవై ఏళ్ల పాటు కెసిఆర్ ముఖ్యమంత్రి అని టిఆర్ఎస్ చెబుతోందని, మరో వైపు కాంగ్రెస్ లో రెడ్లు ముఖ్యమంత్రి పదవికి పోటీపడుతున్నారని, మరి మిగిలిన వెనుకబడిన,దళిత, మైనార్టీ వర్గాలకు అవకాశం ఇవ్వరా అని ఆయన ప్రశ్నించారు. గజ్వేల్ లో ముఖ్యమంత్రి కెసిఆర్ పై గద్దర్ ను పోటీచేయాలని కోరామని,ఆయన అంగీకరించారని ఐలయ్య తెలిపారు.మావోయిస్టు, న్యూ డెమొక్రసీ పార్టీలు ఎన్నికలను బహిష్కరించకుండా ఎన్నికలలో పోటీచేయాలని ఆయన సూచించారు.బిసిలకు అరవైఆరు స్థానాలు ఇచ్చే పార్టీలకు తమ మద్దతు ఉంటుందని ఆయన అన్నారు.బహుజనులే సి.ఎమ్.కావాలని ఆయన ఆకాంక్షించారు.

Please follow and like us:

You may also like...