గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులకు పోలీసుల నియమ నిబంధనలు…

కర్నూలు జిల్లా/మహనంది: నేటి నుండి మహనంది మండలంలో గణేష్ ఉత్సవాలు ప్రారంభం.గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులకు పోలీసులు నియమ నిబంధనలను జారీచేశారు. అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు గణేష్ ఉత్సవాల సందర్భంగా గ్రామాల్లో అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని మహానంది ఎస్సై తులసి నాగప్రసాద్ సోమవారం తెలిపారు. భక్తిశ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలను నిర్వహించాలని ఆయన సూచించారు.

మండల పరిధిలోని గ్రామాల్లో గణేష్ విగ్రహాలను ఏర్పాటు చేసుకునే ముందు తమకు సమాచారం అందించాలని ఉత్సవ కమిటీ లను కోరారు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా గ్రామాల్లో గణేష్ విగ్రహాలను ఏర్పాటు చేస్తే చర్యలు తప్పవన్నారు నియమ నిబంధనల మేరకు విగ్రహాల వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత కమిటీలఅదేనని అన్నారు అసాంఘిక కార్యకలాపాలకుఉత్సవాల ముసుగులో పాల్పడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకొని రావాలని వాటిని పరిష్కరిస్తామని అన్నారు.

Please follow and like us:

You may also like...