Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

గంజాయి గుప్పుమంటోంది…!

  • సరదాగా మొదలై…చివరికి యముడి పాశంలా మెడకు బిగుసుకుంటుంది.
  • ఇనుప కండరాలు,ఉక్కు నరాలు పాతికేళ్ల వయస్సుకే తుస్సు మంటున్నాయి.
  • దేశ భవిష్యత్తు విద్యార్థుల పైనే ఉన్నది.
  • తెలుగు రాష్ట్రాల్లో గంజాయి పొగ రాజుకుంటోంది.
  • నాగార్జున సాగర్ ప్రాంతం కూడా అదే కోవలో ఇప్పుడు వంద రేట్ల వేగం తో దూసుకుపోతుంది.
గంజాయి వనం లో ఏజెన్సీ వాసులు

హైదరాబాదు/నాగార్జున సాగర్: తెలుగు రాష్ట్రాలు గంజాయి ఉచ్చులో బిగిసుకుపోతున్నాయి. సరిహద్దుల్లో,నిర్మానుష్యం గా ఉండే ప్రజల తాకిడి లేని ప్రదేశాల్లో గంజాయి వనాలు పెంచి జనాలను బానిసలుగా మార్చుతూన్నాయి.అడ్డుకోవాల్సిన నిఘా వర్గాలు ఎప్పటికప్పుడు డేగ కన్ను వేసి ఉంచిన రాజకీయ ఒత్తిళ్లు గంజాయి మాఫియా కి వెన్నుదన్నుగా ఉంటున్నాయా ? అన్న అనుమానాలు సందేహాలు ప్రస్తుతం ప్రజల్లో రేకెత్తుతున్నాయి.సరిహద్దుల్లో ఉండే చెక్ పోస్ట్ ల్లో సిబ్బంది మామూళ్ల మత్తులో నిద్రలో జోగుతున్నాయి.అసలు ఏ వాహనం లో ఏమి పోతుందో ఏమేమి తరలి పోతున్నాయో పట్టించుకునే నాథుడే లేరన్నది అక్షర సత్యము.ఇలా మామూళ్లకు వాళ్ళు బానిసలూ అవ్వటం తో పట్టణాలు,నగరాలు మరియు రాష్ట్రాలు,దేశ సరిహద్దులు దాటడం,రావడం వాటంత అవ్వే అదే గుట్టుగా గంజాయి దందా గుట్టుగా సాగుతుంది.ప్రస్తుతం అదే కోవలో నాగార్జునసాగర్ పర్యాటక కేంద్రం అవ్వడం తో సాగర్ బాక్ వ్వాటర్ లో విహార యాత్రకు పర్యాటకులు ఎక్కువ అవ్వడం తో పాటు సాగర్ నిర్మానుష్య ప్రాంతం లో జనావాసాలు లేని ప్రదేశాల్లో గంజాయి సాగు జరుగుతోందని సమాచారం.ఇలా కొండ ప్రాంతాల్లో ఉండే ఏజెన్సీ వాసులు కు కొందరు రాజకీయ నాయకులు కొమ్ము కాస్తుండటం తో వ్యాపారం మూడు దమ్ములు,ఆరు కిక్కులుగా సాగుతున్న దుస్థితి దాపురించింది.మరి దీనికి అడ్డుకట్ట వేసేది ఎవరన్నది జవాబులు లేని ప్రశ్నే?.

జనాన్ని నిండా గంజాయి దమ్ములో ఉన్న వారికి విముక్తి కలిగేదేప్పుడు.ప్రస్తుతం ఏజన్సీ ప్రాంతం లో వేల ఎకరాల్లో గుట్టుగా పండుతున్న గంజాయి వనాలు అక్రమార్కులకు సిరులు కురిపిస్తోంది.గంజాయి రోగానికి అభం శుభం తెలియని ఇంటర్ కాలేజి విద్యార్థులు మొదలు ఇంజనీరింగ్ డాక్టర్ చదువులు చదివే వారే ఎక్కువ.వీరితో పాటు కొందరు బడాబాబుల పిల్లలు గంజాయిలో మునిగి చిత్తు చిత్తూ అవుతుంటే మరికొందరు మధ్య తరగతి వాళ్ళ పిల్లలు ఫ్యాషన్ ల మొదలై బానిసలు గా మారుతున్న వైనం.గతం లో కేరళ,తమిళనాడు నుండి గంజాయి వ్యవస్థ మన వరకు పాకింది.తెలంగాణ రాష్ట్రం లో గత నాలుగైదు ఏళ్లలో మద్యం అమ్మకాల్లో స్పీడ్ గా దూసుకుపోతున్న విషయం తెలిసిందే.ఐతే మద్యం కన్నా చాలా ప్రమాదకరం అని వైద్యులు తెలుపుతున్నారు.ఒక్కసారి గంజాయి దమ్ము లాగారో ఇక పాతాళం లోకి వద్దన్నా పోవాల్సిందే.

గంజాయి పై ఎప్పటి నుండో దేశం లో నిషేదాజ్ఞలు ఉన్నప్పటికీ ఎక్కడ ఆగిన దాఖలాలు లేవు.గంజాయి అమ్మినా,పండించిన లేదా త్రాగిన అది నేరం గా పరిగణించబడుతుంది,అలాగే చట్టరీత్యా జైలు ఊచలు లెక్కించాల్సిందే.అయినా డబ్బులుంటే చాలు మనకు మన జనం మధ్యే దొరుకుతుంది.ఎలా దొరుకుతుందంటే జవాబులు లేని ప్రశ్నలు ఎన్నో మరి? ఇప్పుడు సాగర్ ప్రాంతం లో గంజాయి గుప్పు గుప్పు మని పొగ జూరుతున్నది.మద్యం కన్నా ఎక్కువగా అమ్ముడుపోతుంది అంటే ఎందుకో తెలుసా మద్యం కన్నా తక్కువ ధర లో ఎక్కువ కిక్కు ఇస్తుండటమే కారణమని తెలుస్తోంది.మన తెలుగు రాష్ట్రాల్లో పాండే గంజాయి పదిహేను వందల నుండి మూడు వేలు నాణ్యతను బట్టి కిలొ దొరకడం కూడా కారణమని తెలుస్తున్నది.గంజాయి మాఫియా పది వేల రూపాయలు వెచ్చిస్తే లక్షల్లో రాబడి ఉండటం, ఏజెన్సీ ప్రాంతం ప్రజలు ఎక్కువ మొగ్గు చూపడం కారణం అని తెలుస్తున్నది.అయితే నిన్న నాగార్జున సాగర్ ప్రాంతం లో గంజాయి గుంజుతూ దమ్ము కొడుతున్న కొందరు విద్యార్థులను పట్టుకున్న స్థానిక పట్టణ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ గంజాయి దమ్ముకొడుతున్న విధార్థులను అదుపులోకి తీసుకోగా వారి తల్లిదండ్రులు కాళ్ళ వెళ్ళా పడటం తో మొదటి సారి అవ్వడం తో మందలించి వదిలారని సమాచారం.

Please follow and like us:

You may also like...