క్యూఆర్టి కమెండోల తనిఖీలు, రూట్ మార్చ్…!

కరీంనగర్ : నూతనంగా శిక్షణ పొందిన క్యూఆర్టి కమెండోల రానున్న గణేష్ నిమజ్జనం, మొహరం, ముందస్తు ఎన్నికల నేపధ్యంలో బుధవారం నాడు కరీంనగర్ లో తనిఖీలు, రూట్ మార్చ్ నిర్వహించారు.

తొలుత బస్టాండ్ లో తనిఖీలు చేపట్టి, బస్టాండ్ నుండి ఇందిరాచౌక్ వరకు రూట్ మార్చ్ నిర్వహించారు. ఆర్ఏఎఫ్ తరహలో యూనిఫారం ధరించి పైన పేర్కొన్న కార్యక్రమాలను కొనసాగించారు. గణేష్ నిమజ్జనం, మొహరం, ముందస్తు ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో కొనసాగించేందుకు ఈ క్యూఆర్టి కామెండోలను వినియోగించనున్నారు.

ఈ కార్యక్రమంలో ఆర్ఐలు మల్లేశం, జానిమియా, ఎస్ఐ నాగరాజు, ఆర్ఎస్ఐ లాల్ బాబులతోపాటుగా కమెండోలు పాల్గొన్నారు.

Please follow and like us:

You may also like...