Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

కోరుట్ల నియోజక వర్గం నుండే రమణ?

హైదరాబాద్/జగిత్యాల/కోరుట్ల: టీఆరెస్ పార్టీ ఓట‌మే ల‌క్ష్యంగా సాగుతున్న పొత్తుల చ‌ర్చ‌ల‌కు ఇబ్బందులు త‌ప్ప‌టం లేదు. అయితే, ఇవి పార్టీల‌ పొత్తుల‌పై ఇబ్బందులు కావు కానీ, ఆయా పార్టీల‌ నేత‌లకు నిద్ర‌లేకుండా చేస్తున్నాయి. త‌మ పొత్తుల‌తో అధికార పార్టీకి నిద్ర‌లేకుండా చేయాల‌నుకుంటే…. కూట‌మిలోని నేత‌ల‌కే ఇప్పుడు ఇబ్బందులు త‌లెత్తుతున్నాయి.

ముఖ్యంగా టీడీపీ తెలంగాణ పార్టీ అధ్య‌క్షుడు ఎల్. ర‌మ‌ణ‌కు పొత్తుతో త‌నక పోటీ చేసే స్థాన‌మే లేకుండా పోయింది. త‌న ఎంతో కాలంగా జగిత్యాల నియోజ‌క‌వ‌ర్గంపై దృష్టిపెట్టాడు. ఆయ‌న అక్క‌డ నుండే గ‌తంలో ప్రాతినిధ్యం కూడా వ‌హించాడు. కానీ ఈసారి పొత్తులో భాగంగా ఆ సీటు కాంగ్రెస్ వ‌శం కానుంది. జ‌గిత్యాల నుండి ప్ర‌స్తుతం కాంగ్రెస్ పార్టీ సీనీయ‌ర్ నేత జీవన్ రెడ్డి సిట్టింగ్ గా ఉన్నారు. దీంతో ఆ సీటు వ‌దులుకోవ‌డానికి జీవ‌న్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ సిద్దంగా లేదు. మ‌రోవైపు ఎల్. ర‌మ‌ణ కూడా తాను ఎక్క‌డ నుండి పోటీ చేయాలో డైల‌మాలో ప‌డ్డారు.

స్వ‌యంగా పార్టీ అద్య‌క్షుని టికెట్ నిరాక‌రిస్తే… పొత్తులు ఎలా ముందుకు సాగుతాయ‌ని తెలుగుదేశం నేత‌లు మ‌ద‌న‌ప‌డుతుండ‌గా, కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆ టికెట్ ఇవ్వ‌డానికి ఒప్పుకునే ప‌రిస్థితి లేదు. పైగా అక్క‌డ ఇద్ద‌రు నేత‌లు క‌లిస్తే… ఓట‌మి అనే ప్ర‌సక్తే ఉండ‌దు. దీంతో ఇద్ద‌రు నేత‌లు అదే సీటుపై ఆశ‌పెట్టుకున్నారు. ఇద్ద‌రు సీనీయ‌ర్ నేత‌లు కావ‌టంతో… ఇరువురినీ ఒప్పించటం ఇప్పుడు క‌త్తి మీద సాములా మారింది.

అయితే, ఎల్.ర‌మ‌ణ‌ను కోరుట్ల నుండి పోటీ చేయాల‌ని ఉత్త‌మ్ సూచించినట్లు తెలుస్తోంది. అక్క‌డ తాజా మాజీగా ఉన్న క‌ల్వ‌కుంట్ల విద్యాసాగ‌ర్ రావు చాలాకాలంగా గెలుస్తూ వ‌స్తున్నారు. ఆయ‌న‌పై వ్య‌తిరేక‌త పెరుగుతూ ఉంది. ఈ నేప‌థ్యంలో అక్క‌డ కాంగ్రెస్ పార్టీ నుండి అసంతృప్తులు లేకుండా, పార్టీ నేత‌లంతా ఎల్.ర‌మ‌ణ విజ‌యానికి స‌హ‌క‌రించేలా తాము బాధ్య‌త తీసుకుంటామ‌ని ఉత్త‌మ్ హ‌మీ ఇచ్చిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. దీంతో ఎల్.ర‌మ‌ణ కూడా త‌ప్ప‌ని ప‌రిస్థితుల్లో కోరుట్ల‌కు వెళ్లేందుకు సిద్ధ‌మ‌వ‌తున్న‌ట్లు తెలుస్తోంది.

Please follow and like us:

You may also like...