కేసీఆర్ డి.కె.అరుణమ్మపై వ్యాఖ్యలు చేస్తే నీ బండారం బయట పెడతాం…!

  • బండల పద్మావతి మాజీ మునిసిపల్ చైర్ పర్సన్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, జోగులాంబ గద్వాల జిల్లా…

నీ పాస్ పోర్ట్ బ్రోకర్ బండారం బయటపెడతాం…
ఉత్తరప్రదేశ్ లో తాజ్ కారిడార్ కేస్ సంగతి….?
కార్మిక శాఖ మంత్రిగా సహారా ఇండియా కు చేసిన అక్రమ సేవలపై విచారణ కు సమాధానం తప్పదు…
ESI హాస్పిటల్ స్కామ్ పై సీబీఐ విచారణ నిజం కాదా…?
ఇలా ఎన్నో ఎన్నెన్నో …చాలా బండారాలు ఉన్నాయి…
కేసీఆర్ నీకు సంస్కారం ఎలాగూ లేదు…
మహిళలకు నీవిచ్చిన హామీలు నీటిమూటలే అయినప్పుడు మహిళా నేతల పై అసభ్య వ్యాఖ్యలు చేస్తే చీపురలతో సమాధానం చెబుతారు.
33శాతం మహిళా రిజర్వేషన్ ఏమైంది…?
వాస్తవంగా 2014 గద్వాల ఎన్నికల సభలో నీవిచ్చిన హామీలు ఒక్కటైనా అమలు చేసావా..?
కేసీఆర్ నీవు గద్వాల కు వచ్చే అధికారం లేదు….
ఎందుకో తెలుసా..?
జూరాల లింక్ కాల్వ ఎక్కడ..?
బోయవాల్మీకుల ఎస్.టి.లుగా చేసే మొదటి G.O. ఎక్కడ..?
ముస్లిం మైనారిటీలకు 12./. రిజర్వేషన్లకు ఇంకా ఎన్ని రంజాన్ లు రావాలి…?
కేసీఆర్ నీవు అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు దాటిపోయిన మాట మరిచావా…? ⚡ఒక్క యాడాది లోనే జవహర్ నెట్టెంపాడ్ ఎత్తిపోతల పథకం మిగిలిన 10 శాతం పూర్తి చేస్తా అని ఒక్క తట్టాడు మట్టి ఎత్తినావా..?
కుర్చీ వేసుకొని RDS చివరి ఆయకట్టుకు నీరిస్తా అని చెప్పిన మాటలు దొంగ కూతలు కావంటారా…?
గద్వాలను నీటముంచే గుర్రంగడ్డ బ్యారేజ్ కు చెప్పట్లు కొట్టిన నీ అసమర్థ స్వార్థ నాయకులు చూసి నీవు పెద్ద తోపు అని ఫీల్ కావద్దు….మా నడిగడ్డ ..పోరాటాల గడ్డ…గుర్తుంచుకొని మెలుగు.


గద్వాల మీటింగ్ లో చెప్పిన గిరిజనులకు 12./.రిజర్వేషన్ ఎక్కడ…?
గద్వాలలో చెప్పిన యాడాదికి 5000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎక్కడ…?
ఇంటింటికి తాగునీరు ఎక్కడ…?
లక్ష ఉద్యోగాలు ఎక్కడ..?


ఇంకా ఎలా బూ…బూచి మాటలు చెప్పి దుర్మార్గ పాలన చేసి ఇచ్చిన మాటకు కట్టుబడి పదవులను, ప్రాణాన్ని త్యాగం చేసి పోరాడిన డి.కె. అరుణమ్మ పై మరోసారి వ్యాఖ్యలు చేస్తే ఆనాటి నిజాం కు పట్టిన గతి నీకు తప్పదు…

శాశ్వత రాజకీయ ఘోరి కడతాం.
మీలాంటి మహిళా వ్యతిరేక శక్తుల పాలిట జోగులాంబమై, జములమ్మ మై తాట తీస్తాం.
తెలంగాణ ప్రజలు నీకు అధికారం ఇచ్చారు…ఇచ్చిన హామీలు మరిచి సబ్బండ వర్గాల కు చేసిన అన్యాయాన్ని ప్రజలు మరవలేదు…. ఇది నిజం…

Please follow and like us:

You may also like...