కేరళ వరద బాధితుల్ని పరామర్శించిన రాహుల్ గాంధీ…

కేరళ/త్రివేండ్రంచెన్‌గన్నూర్‌/:కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ వరద బాధిత కేరళ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు.త్రివేండ్రం విమానాశ్రయం చేరుకున్న రాహుల్‌ చెన్‌గన్నూర్‌కు వచ్చారు. అక్కడ ఓ పునరావాస శిబిరానికి వెళ్లి బాధితుల యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వరద ప్రభావం అధికంగా ఉన్న చెన్‌గన్నూర్‌, అలపుజా, అంగమలీ ప్రాంతాల్లో ఈ రోజు ఆయన పర్యటించనున్నారు. రేపు వాయాంద్‌ జిల్లాలో పర్యటన చేయనున్నారు. కొచ్చి విమానాశ్రయాన్ని మధ్యాహ్నం రెండు గంటలకు తిరిగి ప్రారంభిస్తామని అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు

Please follow and like us:

You may also like...