కేరళ లో ఎందుకిలా జరిగింది?

జల ప్రళయం వెనుక ఉన్న అసలు కారణాలేంటి ?

హైదరాబాదు : ప్రొఫెసర్ మాధవ్ గాడ్గిల్ పేరు గుర్తుందా? 
అవును  బహుశా ఆయన్ను గుర్తుపట్టని వారుండరేమో, ఆయనే పర్యావరణ ప్రేమికుడు, శాస్త్రజ్ఞుడు కూడా 99 ఫ్లడ్స్ తరువాత నాటి కేరళ రాష్ట్ర ప్రభుత్వం 1924 లో జరిగిన విపత్తు నేపధ్యం లో అటు తరువాత జరిగిన పరిణామాల వలన ఓ అడుగు ముందుకు వేసి మాధవ్ గాడ్గిల్ నేతృత్వం లో ఓ ప్రత్యేక కమిటీ ని వేశారు.

ఇది ఇలా ఉండగా ఆయన్ను అప్పటి సామాజిక వన విభాగం వాళ్ళు పశ్చిమ కనుమల్లో పరిశోధనలు నిర్వహించి రిపోర్టు ఇవ్వమన్నారు. ఆయన తన సుదీర్ఘ పరిశోధనలనంతరం, 
🔹అటవీ నిర్మూలన, 
🔹క్వారీలు తవ్వేయడం (దాదాపు 1500 అక్రమ మైనింగులు)
🔹 నదుల నుండి ఇసుక తరలింపు, 
🔹వరిపోలాలను జనవాసాలుగా మార్చటం లాంటి చర్యల వల్ల *ఎన్నడూ చూడని వరదలు, కొండచరియలు పడడం లాంటివి కేరళ ఎదో ఒకరోజు చూస్తుందని ఆయన హెచ్చరించారు.

👉 దాదాపు అన్ని నదీ తీరాల్లో ఇసుక తవ్వేశారు దీని పరిణామం విపరీతంగా ఉంటుందన్నారు. 
దాదాపు రెండు వేల పేజీల రిపోర్టు ఆయన భారత ప్రభుత్వానికి సమర్పించి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టమని వేడుకొన్నారు.
👉 బదులుగా ఆయన రిపోర్టుకు అనుకూలం గ చేసిందేమి లేకపోగా, ఇటు వామపక్షాలు అటు రైట్ వింగ్ పార్టీలు ఆయన్ను తిట్టని తిట్లు తిట్టి  ఆయనకు విరోదంగా పశ్చిమ కనుమల్లో ఆందోళనలు చేపట్టిన ఘనత నాటి రాజకీయ పక్షాల వారిదిగా మిగిలిపోయిన దుస్థితి.
(పోరాడితే పోయేదేముంది…. అని డైలాగు చెప్పుకొంటూ).
👉 ఆయన అవమానంతో మిన్నకుండిపోయారు, ఇప్పుడు మీరు ఊపిరాడక అవస్థలు పడుతున్నారు.

👉 ఎక్కనుండి ఎవరు సహాయం చేస్తారా అని దిక్కులు చూస్తున్నారు.

సముద్రం ఏదీ ఉంచుకోదు జాగ్రత్తగా తిరిగి ఇచ్చేస్తుంది.
ఉదాహరణకు, మాలయత్తూర్ కొడనాడ్ బ్రిడ్జి మీద నీళ్లు తగ్గాక ఏమి మిగిల్చింది?ఎటు చూసినా కళేబరాలు..ప్లాసిక్ బాటిల్స్..మట్టి..చెత్త..శవాల వాసన ను మనకు తిరిగి ఇచ్చేసిన పరిస్థితి !

మాలయత్తూర్ కొడనాడ్ బ్రిడ్జి

భారతీయులైన మనమందరం ఓ పాఠం నేర్చుకోవాలి. 
స్వార్థంతో ప్రకృతిని కబలిస్తే, ప్రకృతి మనల్ని కబళించిన రోజు భూమ్యాకాశాలు ఏకమౌతాయి.

👉 పర్యావరణాన్ని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుంది..

👉 మరి మనం ఏమి చేస్తున్నాము? 
🔹 *అవకాశం ఉన్నపుడల్లా చెట్లని నరకడం,*
🔹 *నదుల్లో ఇసుక ఇష్టానుసారంగా తవ్వడము.*
🔹 *కొండల్ని తొలిచి ఇల్లు కట్టడం,భారీ భవంతులు కట్టేయడం ..*

మరి చివరికి ఏమి మిగిలింది అని వెనక్కి చూస్తే ! చేతులు చాచి అర్థించడం తప్ప ?

Please follow and like us:

You may also like...