కేరళలో ఆసక్తికర సంఘటన.. హిందూ ఆలయంలో ఈద్ ప్రార్థనలు…!

సోషల్ మీడియా లో వైరల్ అయిన వైనం…..

న్యూఢిల్లీ: భారీ వర్షాలు, వరదలలో అతలాకుతలమైన కేరళలో.. మత సామరస్యానికి అచ్చమైన ప్రతీకగా ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలోని కొచ్చుకడవు గ్రామంలో మసీదు ఇప్పటికీ వరద నీటిలోనే ఉండిపోయింది. అందులోకి ప్రవేశించే అవకాశం లేకపోవడంతో బక్రీద్‌ ప్రార్థనలకు స్థలం కోసం ముస్లింలు ఆందోళన చెందారు. దీంతో వారు ప్రార్థనలు చేసుకునేందుకు వీలుగా ఓ హిందూ ఆలయం ముందుకొచ్చింది. పురప్పుల్లికవు రత్నేశ్వరి ఆలయ ప్రాంగణంలో ఈద్ ప్రార్థనలు జరుపుకోవాలంటూ ఆలయ యాజమాన్యం ఆఫర్ చేసింది. ముస్లింలు హిందూ ఆలయాన్ని శుభ్రం చేయడం, హిందువులు ముస్లింలకు సహకరించడంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. దీని తాలూకు వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈద్ ప్రార్థనల కోసం ఆలయం గేట్లు తెరిచిన హిందువులకు కృతజ్ఞతలు, ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ‘మతం పేరుతో దేశంలో శాంతి, ఐక్యతలను దెబ్బతీసేందుకు ప్రయత్నించే మత శక్తులకు ఇది చెంపపెట్టు…’ అని ఈ వీడియో పోస్టు చేసిన అజీమ్ ఆజాద్ పేర్కొన్నారు. ఫేస్‌బుక్‌లో పోస్టు చేసిన కొద్ది గంటల్లోనే ఈ వీడియో 1900 మందికి పైగా వీక్షించారు.

Please follow and like us:

You may also like...