కేరళకు రూ.35 కోట్ల సాయం…ఖతార్ రాజు!

దోహా/ఖతార్: కేరళలో 100 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. వరద ఉదృతికి వందల మంది మరణించడం బాధాకరం. కేరళకు భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన సినీతారలు, రాజకీయనేతలు, వ్యాపారవేత్తలు తమకు తోచినంత సాయం చేస్తూనే ఉన్నారు. గల్ఫ్ దేశాల్లో పనిచేసే భారతీయుల్లో ఎక్కువమంది కేరళకు చెందిన వారే. ఎప్పటి నుంచో పొట్టకూటి కోసం కేరళ నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారు ఎందరో. అందుకే ఇప్పడు భారతీయులతో పాటు గల్ఫ్ దేశాధినేతలు కూడా కేరళలోని పరిస్థితిని చూసి తట్టుకోలేకపోతున్నారు. తమకు తోచినంత సాయం చేయాలనే ఉద్దేశంతో వారు కూడా కేరళకు సహాయం చేస్తున్నారు.ఖతార్  రాజు షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ తానీ కేరళ కోసం తక్షణ సాయంగా ఖతార్  ఛారిటీ నుంచి 5 మిలియన్ డాలర్ల(దాదాపుగా రూ.35 కోట్లు)ను విడుదల చేశారు. అంతేకాకుండా, ఖతార్ ఉన్న వాళ్లందరూ కూడా తమకు తోచినంత సాయం కేరళకు చేయాల్సిందిగా కోరారు. ఇప్పటివరకు చనిపోయిన వారందరికి సంతాపం తెలియజేస్తూ, గాయాలైన వారందరూ త్వరగా కోలుకోవాలని ప్రధాని నరేంద్రమోదీకి, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ఆయన సంతాపాన్ని పంపారు

Please follow and like us:

You may also like...