కిరాయి కోట పై…త్రివర్ణ పతాకం!

ఎర్రకోటకు కిరాయి చెల్లించి జాతీయ జెండా ఎగర వేయాల్సిన దుస్థితి నేటి మన దేశానిది !

మరో చరిత్ర సృష్టించ నున్న మోడీ..!

ఢిల్లీ : రేపు ఉదయం ఎర్రకోట మీద నుంచి మన దేశ ప్రధాని త్రివర్ణపతాకాన్ని ఎగరవేస్తున్నప్పుడు మన దేశ చరిత్రలో గతంలోమునుపెన్నడూ లేనివిధంగా మొదటిసారి జరుగనున్న ఒక విశిష్టతను మనందరం గమనించవలసిన దుస్థితి దాపురించింది

72 ఏళ్ళ స్వతంత్ర్య భారత చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక పెట్టుబడిదారుడికి కిరాయి చెల్లించి, మన దేశ గౌరవానికి చిహ్నమైన త్రివర్ణపతాకాన్ని ప్రధాని ఎగురవేయనున్నారు!!

అవును, మీరు వింటున్నది పచ్చి నిజం! 
చెప్పుకోవడానికే మనందరం సిగ్గు పడుతున్నా.. ఇది కఠిన వాస్తవం!!

ఎర్రకోటకు 10 లక్షలు అద్దె చెల్లించి జాతీయ పతాక ఆవిష్కరణకు సిద్దం అవుతున్నార మన దేశ ప్రధాని అంటే అవును అని చెప్పక తప్పట్లే

ఇటీవలే ఎర్రకోటను దాల్మియా కు 25కోట్లకు (5సం..లకు) లీజుకి ఇచ్చింది మన మెన్నుకున్న మోడీ ప్రభుత్వం.
మనము బ్రిటీష్ వారి విషకౌగిలి నుండి బయట పడింది కార్పొరేట్లకు దాసోహమవడానికేనా?

స్వాతంత్ర్య ఫలాలు సామాన్యులకు 
అందుతాయని నాడు ఆశ పడ్డాం.
కానీ నేడు గద్దెనెక్కిన మన పాలకులు మన దేశగౌరవాన్ని సైతం పెట్టుబడిదారులకు తాకట్టు పెడుతున్నారు!

కార్పొరేట్ అధినేతలకు గులాంగిరి చేస్తున్న 
రాజకీయ పార్టీల అధినేతలారా?
బానిస బుద్ధితో మీరు అందించే వందనాలను.. మహోన్నత నా దేశ పతాకం స్వీకరిస్తుందా?? అదెన్నటికీ జరుగదు.

ఇకనైనా ..దేశ ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు ప్రయత్నించండి.

ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ విధానాలను పక్కకుపెట్టి.. స్వదేశీ – స్వావలంబన విధానాలను అమలు చేయక పొతే ఈ భారత జాతి బిడ్డలు, చరిత్ర మిమ్మల్ని క్షమించదు.

Please follow and like us:

You may also like...