కాంగ్రెస్ లోకి గల్ఫ్ నాయకుడు…బసంత్ రెడ్డి..!

హైదరాబాదు : ఉన్నఊరిలో  సరైన ఉపాది లేక, ఉన్నా సరిగా దొరక్క, ఓవైపు వాతావరణం అనుకూలించక దానితో పాటు ఆరు గాలం కష్టపడి పండించిన పంట చేతికి వచ్చిన సమయాన గిట్టుబాటు ధర లభించక అప్పుల ఊబిలో కూరుకు పోయిన ఎందరో పొట్ట చేత పట్టుకుని గల్ఫ్ బాట లో పయనిస్తూ అక్కడ వాతావరణం అనుకూలించక పని చేసే కంపెనీల్లో జీతాలు సరిగా రాక ఇలా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ అనారోగ్యం పాలు అయినా వారు తిరిగి రావడం,మరణించిన వారి మృతదేహాలను స్వగ్రామ్ చేర్చుటకు,అనుకోని సంఘ్టనల నేపధ్యం లో జైలు పాలు అయిన వారికి అలాగే విశాల మాటున నష్టపోయి అరబ్బు దేశాలలో చిక్కుకు పోయిన వారికి సేవలు అందించడం కోసం కొన్ని సంస్థలు,సామాజిక సేవకులు ప్రభుత్వాలు చేయలేని ఎన్నో కార్యక్రమాలను తమ భుజాలపై వేసుకుని గల్ఫ్ కార్మికుల కు భరోసానిస్తున్నారు. ఆ కోవకు చెందిన ఓ గల్ఫ్ సామాజిక వేత్త,గల్ఫ్ వెల్ఫేర్ అధికార ప్రతినిధి బసంత్ రెడ్డి ప్రస్తుతం తానూ తన యొక్క సేవలు మరింత ప్రజలకు చేరువ అయ్యేలా ఆలీచించి తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఆలోచిస్తున్నట్లు,హై కమాండ్ తో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఊహాగానాలు ఊపందుకున్నాయి.

Please follow and like us:

You may also like...