కాంగ్రెస్ పార్టీలో చేరిన (ఛాంబర్ ఆఫ్ కామర్స్ ) అధ్యక్షుడు యెరవెల్లి సురేష్….!

కా

జగిత్యాల పట్టణ వర్తక సంఘం (ఛాంబర్ ఆఫ్ కామర్స్) అధ్యక్షుడు యెరవెల్లి సురేష్ తో పాటు పలువురు వైశ్య సంఘ నాయకులు, యువకులు మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి ఆద్వర్యంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ లో చేరారు.యెరవెల్లి సురేష్ తో పాటు పలువురు జిల్లా ఆర్య వైశ్య సంఘం నాయకులు, వ్యాపారులకు మాజీ మంత్రి జీవన్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వైశ్య సంఘ అభివృద్ధి కోసం గతంలో కృషి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. గతంలో తాను, ముఖ్యమంత్రి వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి జగిత్యాలకు వచ్చినపుడు వైశ్య సంఘ నాయకులు చేసిన విజ్ఞప్తి మేరకు వైశ్యభవనాన్ని వైశ్యుల ఆధినంలోకి తీసుకువచ్చిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు.

అందరిసమిష్టి సహకారంతోనే గత ఎన్నికల్లో తాను విజయం సాదించగలిగానని ఈ ఎన్నికల్లో కూడా పూర్తి స్థాయి లో అందరూ సహకారమందించాలని కోరారు ఈ ఎన్నికల్లో గెలుపులో ప్రతిఒక్కరూ భాగస్వామ్యం కావాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో బల్దియా చైర్మన్ టి.విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి , మాజీ బల్దియా చైర్మెన్ గిరి నాగభూషణం కౌన్సిలర్లు గాజుల రాజేందర్ , అనుమల్ల శ్రీనివాస్, పుప్పాల అశోక్, పిప్పరి అనిత, పులి రాము , మాజీ జడ్పీటిసి ముస్కు ఎల్లారెడ్డి, వైశ్య సంఘ నాయకులు, పెద్ది శంకర్ లింగం, కొత్త మోహన్, కమటాల శ్రీనివాస్, జిల్లా గంగాధర్, వుత్తూరి రాజేందర్ , తదితరులు పాల్గొన్నారు.

Please follow and like us:

You may also like...