Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

కష్టాల్లో కొందరు….హల్చల్ చేస్తున్న మరికొందరు?

హైదరాబాదు/బ్యూరో చీఫ్:

తెలంగాణ లో ఎన్నికలు ఏమో కానీ మునుపెన్నడూ చూడని పరిస్థితి నేడు నెలకొన్నదని చెప్పకతప్పట్లేదు. ఈ నేపధ్యం లో

ఈ ఎన్నికల్లో మీరు కనుక  కాంగ్రేస్ పార్టీకి సహకరిస్తే, వచ్చేది మా ప్రభుత్వమేనని, వచ్చాక మీ మీ పింఛనులు కత్తెరేసి కత్తిరిస్తామని, మీ భరతం పట్టడమేనని అధికార పార్టీకి చెందిన కొందరు చోట మోట గల్లీ లీడర్లు దబాయిస్తున్నారని తెలుస్తోంది.

ఇకపోతే సామాజిక మాధ్యమాల్లో తెలంగాణ లో ఎన్నికల వేళ అధికార పార్టీకి అనుకూలం గా ఉన్నవారు ఏది చెప్పాలనుకున్న వ్యంగ్యం గా, అతి జుగుప్సాకరమైన పదజాలం తో నోటికి తోచింది ఆ సామాజిక గోడల మీద రాసేస్తున్నారు.

తెలంగాణ లో ఎన్నికల ఊపందుకున్నది. ఎన్నికల ప్రచారం లో ఎవరి కి తోచినట్లు వారు దూసుకుపోతున్నారు. అయితే ఎన్నికల కోడ్, ఆంక్షల వాళ్ళ కొంత పార్టీలకు వెసులుబాటు తో పాటు ఇక్కట్లు తప్పడం లేదు. ఈ నేపధ్యం లో అధికార పార్టీకి కొంగర కాలాను సభ కు ముందే నాడే బాక్సుల్లో భద్రంగా కోట్ల రూపాయలు పంపిణీ చేశారన్న ఊహాగానాలు ఇప్పటి పరిస్థితులు చూస్తే అవుననే చెబుతున్నాయి. ఏది ఏమైనా ఈ ఎన్నికల్లో అధికార పార్టీకి గడ్డు పరిస్థితే కనపడుతున్నది. సిట్టింగ్ ల కే టికెట్ లు కేటాయించడం లాంటి తప్పిదాలు, అలాగే చరిష్మా లేని వారినే ఇంకా నమ్ముకోవడం, తో పాటు గడిచిన నాలుగున్నరేళ్లలో అవసరం లేని వాగ్ధానాలు చేసి ఇప్పుడు ఆ వాగ్ధానాల తో కొన్ని గ్రామాల్లో రాష్ట్రం అంతటా చూస్తే అదే గడ్డు పరిస్థితి నెలకొన్నది. తిరుగు లేదన్న వారి నియోజకవర్గం లో సైతం పోలీసుల సహాయం తప్పడం లేదు. రాష్ట్రం లో ఏదైనా అనుకూలం గా ఉన్నదంటే అది ఒక్కటే పోలీసు శాఖ ఇంకా కూడా ఎన్నికల కోడ్ వచ్చినప్పటికీ, రాజ్యాంగ ఉల్లంఘనలు బాహాటం గానే ఉన్నాయన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఓట్లు చీలే నియోజకవర్గాలలో కొందరు అభ్యర్థులను పోలీసు అధికారులు వేధించడం, భయబ్రాంతులకు గురి చేయడం తో పాటు అసభ్యకర పదజాలం తో విసిగివేసారిస్తున్నారని తెలుస్తోంది. ఇది ఇలాగ ఉండగా పోలీస్ శాఖ ఉన్నతాధికారులు క్రైమ్ మీటింగ్ లు పెట్టి లా అండ్ ఆర్డర్ అదనపు డిజిపి ఆద్వర్యం లో చేసిన సలహాలు, సూచనలు బుట్ట దాఖలాలు గానే ఉన్నాయన్న గుసగుసలు రాష్ట్రం లో వినపడుతుండటం ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. అధికార పార్టీకి చెందిన వారు, ప్రచారం లో ఎక్కడ పడితే అక్కడ స్పీచ్ లు ఇస్తూ వచ్చిపోయే వారికి ఇబ్బంది కలిగిస్తున్నారు. మొన్న హైదరాబాదు నగరం లో తెరాస ఎంపీ చేసిన ఓ ర్యాలీ వాళ్ళ దాదాపు అరగంట సేపు అత్యవసర చికిత్సలు అందించే అంబులెన్స్ ఆ ర్యాలీ లో చిక్కుకుని ప్రాణాలు గాల్లో పోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇదంతా చూస్తుంటే అధికారులు సైతం మునుపెన్నడూ లేని విధం గా రాజకీయ ఒత్తిళ్లకు గురవుతున్నట్లు తెలుస్తోంది. ఓ వైపు తెలంగాణ లో లేని రాజకీయ అటకాయింపు పిడిగుద్దులు సైతం కొత్త పుంతలు తొక్కిస్తున్నది. ఏది ఏమైనా మున్ముందు ఇంకా ఎన్నెన్ని చూడాల్సి వస్తాడో ఏమోనని ఇటు అధికారులు, అటు ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు.

Please follow and like us:

You may also like...