కంట తడి పెట్టించిన సన్నివేశం….

ఓ యదార్ధ సంఘటన…

నానమ్మ ను చూసి బోరున విలపించిన మనవరాలు…

సోషల్ మీడియా లో వైరల్ అయిన వైనం…

వృద్ధాశ్రమానికి వెళ్తే నానమ్మ కనిపించింది..

స్వార్థం తప్ప మమతలకు, మానవ సంబంధాలకు ఏమాత్రం విలువ ఇవ్వని లోకం ఇది. ‘నేను, నా భార్య, పిల్లలు.. ’ అనే స్వార్థం రాక్షసిలా జడలు విప్పి ఆడుతోంది. ఫలితం.. ఇలాంటి దృశ్యం…!! జాగ్రత్త పడకపోతే మనకు, మన పిల్లలకు కూడా ఇలాంటి పరిస్థితి రావొచ్చు..!! వాళ్లు అడిగే ప్రశ్నలు మనల్ని శూలాల్లా గుచ్చుకోవచ్చు..!!

ఈ చిన్నారి ఓ పాఠశాలలో చదువుతోంది. స్కూలు ప్రోగ్రాంలో భాగంగా విద్యార్థులను దగ్గర్లోని వృద్ధాశ్రమానికి తీసుకెళ్లారు. కన్నకొడుకులు కూతుళ్లు నిర్దయగా వదిలేడంతో ఆ ముసలివాళ్లు నానా కష్టాలు పడుతున్నారని వలంటీర్లు వివరించారు. ఈ బాలిక వారు చెప్పే మాటలు వింటూ ముసలాళ్లను చూస్తూ ముందుకెళ్లింది… ఓ చోట స్థాణువులా నిల్చుండిపోయింది. షాక్…!! ఎదురుగా తన సొంత నానమ్మ..!! ఇన్నాళ్లుగా కనిపించకుండా ఎక్కడికో వెళ్లిన నానమ్మ. ‘నానమ్మా?? నువ్వేంటి ఇక్కడ? ఇలా?’ అని బావురుమంటూ ఆ పిల్ల.. వృద్ధురాలిని కౌగిలించుకుంది. ఇద్దరి కళ్లతో నీటిసుడులు. చూస్తున్నవాళ్ల కళ్లలోనూ చెమ్మ.. !!

సీన్ కట్ చేస్తే..

ఈ వృద్ధురాలు కొన్నాళ్ల కిందట ఇంట్లో ఉన్న రోజులవి.. ఆ మనవరాలు స్కూలు నుంచి ఇంటికొచ్చింది. నానమ్మ కనిపించలేదు. అన్ని గదుల్లోనూ వెతికింది. ఆమె జాడలేదు. తండ్రిదండ్రులను అడిగింది. ‘నానమ్మ మన బంధువుల ఇంటికి వెళ్లిందిలేవే. ఎక్కడికిపోతుంది ముసల్ది, వస్తుందిలే… నువ్వెళ్లి బుద్ధిగా చదువుకో’ అని తల్లిదండ్రులు చెప్పారు. ఈ పిల్ల నిజమేనని నమ్మేసింది. తాజాగా వృద్ధాశ్రమంలో అసలు విషయం తెలిసింది.. బామ్మ, మనవరాలు కన్నీరుమున్నీరవుతున్న ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ భావోద్వేగ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియడం లేదు. తెలుస్తున్నదల్లా అడుగంటిపోతున్న మమత, మానవత..!!

Please follow and like us:

You may also like...