ఒక రోజు శిక్షణ….!

జగిత్యాల జిల్లా….

జిల్లా ఎస్పీ శ్రీమతి శ్రీ సింధుశర్మ ఐపిఎస్ ఆదేశాలమేరకు
ఈరోజు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో జిల్లా లో పనిచేస్తున్న వివిధ పోలీస్ స్టేషన్లో బ్లూకోల్ట్స్ , పెట్రోలింగ్ సిబ్బందికి వారి యొక్క విధులు గురించి ఒక రోజు శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ యొక్క శిక్షణ కార్యక్రమం లో డీఎస్పీ ప్రతాప్ గారు మాట్లాడుతూ …ప్రజలు, లేదా డయల్ 100 నుoడి పిర్యాదు అందినప్పుడు ఆ యొక్క సంఘటన స్థలాన్ని కి వీలైనంత త్వరగా చేరుకోవాలని అన్నారు. బ్లూ కోట్స్ బృందాలు సమర్థవంతమైన సేవలందిస్తూ పోలీస్ శాఖ ప్రతిష్టను పెంపొందించాలని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలతో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తూ ఆయా ప్రాంతాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలియజేయాలని సూచించారు. ఎక్కువగా రద్దీ ఉండే ప్రాంతాల్లో గస్తీని నిర్వహించాలన్నారు. అక్రమ కార్యకలాపాల పై నిఘా ఉంచాలన్నారు. విధి నిర్వహణ ముగిసిన అనంతరం విధుల్లో చేరే ఇతర బృందాలకు అక్కడి పరిస్థితులను వివరించాలని సూచించారు. ప్రతిరోజు విధి నిర్వహణకు సంబంధించిన నివేదికను సంబంధిత అధికారులకు అందజేయాలని తెలిపారు. బ్లూ కోట్స్ సిబ్బంది తమకు కేటాయెంచిన యూనిఫామ్ ను తప్పనిసరిగా ధరించాలని అన్నారు.మన జిల్లా కు వచ్చిన పెట్రోలింగ్ వాహనాలను త్వరలో నాలుగు సర్కిల్ పోలీస్ స్టేషన్ లకు జిల్లా ఎస్పీ గారి చే ప్రారంభిస్తామని మరియు ఆ యొక్క వాహనాలను ఏ విధంగా వాడుకోవాలి అనే విషయాలను తెలియ చేశారు

ఈ యొక్క శిక్షణ కార్యక్రమంలో MTO నవీన్ గారు, RI అడ్మిన్ రామారావు గారు, సిబ్బంది పాల్గొన్నారు.

Please follow and like us:

You may also like...