ఒక్కరోజు సమ్మెకు టీఎంఎస్ఆర్ యు…!

తెలంగాణ కెమిస్ట్ మరియు డ్రగ్గిస్టు అసోషియేషన్ సెప్టెంబర్ 28న ఒక్క రోజు సమ్మెకు తెలంగాణ మెడికల్ మరియు సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్ మద్దతు…

ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ మరియు డ్రగ్గిస్టు (ఐఓసీడ్) దేశ వ్యాప్తంగా ‘ఈ ఫార్మసీ’ల ద్వారా ఆన్లైన్ లో చేపడుతున్న మందుల అమ్మకాన్ని పూర్తిగా నిషేదించాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబరు 28 న ఒక్కరోజు బందు పిలుపు ఇచ్చిన సందర్భంలో సమ్మెలో పాల్గొంటున్న ‘తెలంగాణ కెమిస్ట్ మరియు డ్రగ్గిస్టు అసోషియేషన్ ‘ కి తెలంగాణ మెడికల్ మరియు సేల్స్ రిప్రెజెంటేటివ్స్ అసోషియేషన్ ఆఫ్ ఇండియా ‘ఫంమ్రై’ సభ్యులు పూర్తి మద్దతు తెలపడం జరుగుతున్నది.

ఆన్ లైన్ లో మందుల అమ్మకం వలన ఆన్లైన్ లో మందుల అమ్మకం వలన మందుల దుర్వినియోగం జరిగి ప్రజల ఆరోగ్యంపై తీవ్ర దుష్పరినామాలు కలిగే అవకాశం ఉన్నందున అలాగే మందుల రంగంపై ఆధారపడ్డ చాలా మంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉంది కాబట్టి ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని వారికి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి తెలంగాణ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్(TMSRU) జిల్లా శాఖ అధ్యక్షుడు కస్తూరి వెంకటరమణ కార్యదర్శి పిన్నంశెట్టి రాములు ఒక ప్రకటనలో కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు జి విద్యాసాగర్ గారు మరియు జిల్లా వర్కింగ్ కమిటీ సభ్యులు జిల్లా జాయింట్ సెక్రెటరీ తిరుపతి సింగ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీధర్ బాబు జిల్లా కోశాధికారి గా సునీల్ వైస్ ప్రెసిడెంట్ అజయ్ రావ్, ఎం.రాజేష్ జలంధర్ లు పాల్గొన్నారు.

Please follow and like us:

You may also like...