ఒకసారి మనసు పెట్టి చదవండి. మీకే అర్ధమవుతుంది…!

2014 లో తెరాస కి వచ్చిన మొత్తం ఓట్లు 66 లక్షలు (నాటి ఫిగర్ సరిగ్గా 66,20326)

తాజాగా తెలంగాణ లో విఆర్ఓ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలయ్యింది.

కేవలం 700 పోస్ట్ లు రిలీజ్ అయ్యాయి.

ఆ 700 పోస్టులకు తెలంగాణ వ్యాప్తంగా 10 లక్షల పైబడి దరఖాస్తు చేసుకున్నారు. (నాటి ఫిగర్ సరిగ్గా : 10,58,868)

10 లక్షల మందిలో కనీసం 60 శాతం మంది నిరుద్యోగులు టిఆర్ఎస్ ప్రభుత్వంపై అసంతృప్తితో రగిలిపోతూ ఉంటారు. (ఎందుకంటే వాళ్ళు నిరుద్యోగులు కాబట్టి), (తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని వాళ్ళు నమ్మారు కాబట్టి వాళ్ళు ముమ్మాటికీ రగిలిపోతూనే ఉన్నారు). అంటే 10 లక్షల్లో కనీసం ఆరు లక్షల మంది యువకులన్న మాట. ఒక్కొక్కరు వాళ్ళ కుటుంబంలోనో, వేరేవాళ్ళనో ప్రభావితం చేసి ఒక ముగ్గురి చేత తెరాస కి వ్యతిరేకంగా ఓటు వేయించినా కానీ 6 లక్షలు x 3….. అంటే 18 లక్షల ఓట్లు తెలంగాణలో తెరాస పార్టీ వ్యతిరేకంగా పడతాయి. అంటే ఈ చొప్పున ఇక్కడే తెరాస (2014) గత ఓట్ల శాతంలో 25 శాతంపైగా వ్యతిరేక ఓట్లతో 2019 లో తెరాస తుడిచిపెట్టుకుపోనున్నట్లే కదా…!!

Please follow and like us:

You may also like...