Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

ఏ వర్గాన్నైనా ఓట్లడిగె నైతిక హక్కు కేసీఆర్ కు లేదు…!

  • మంత్రి పదవి వస్తే తెలంగాణ ప్రస్తావన వచ్చేదే కాదు
  • ఉద్యమంలో కేటీఆర్ , కవిత ఏనాడైనా జైల్లో ఉన్నారా ..?
  • రాజ్యాధికారం లో భాగస్వాములయ్యేందుకు కేటీఆర్ , కవిత లకు ఉద్యమ ముసుగు

-నీలాగా కమీషన్లకు కక్కుర్తి పడకుండా ఏ అభివృద్ధి అయినా చేస్తాం, కార్యకర్తల చేరిక సభలో తాజా మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి .

జగిత్యాల : ఆనాడు చంద్రబాబు క్యాబినెట్ లో మంత్రి పదవి వస్తే, కేసీఆర్ కు తెలంగాణ ఉద్యమ ఆలోచన, తెలంగాణ ప్రస్తావన వచ్చేదా అని తాజా మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సీఎం కేసీఆర్ పై ఘాటుగా స్పందించారు. గురువారం జిల్లా కేంద్రం లోని స్థానిక దేవిశ్రీ గార్డెన్ లో నిర్వహించిన ఉద్యమకారులు టీఆరెస్ నాయకుల చేరిక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జీవన్ రెడ్డి పార్టీ లో చేరడానికి వచ్చిన టీఆరెస్ ఉద్యమ నాయకులూ గుండా మధు మరియు కొండ్ర రాజేష్ ల ఆధ్వర్యం లో సుమారు 300మంది కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ఉద్యమ సమయం లో కేసీఆర్ ఏమన్నాడు. అధికారం లోకి వచ్చాక ఎం ఆచరించాడో ప్రజలకు వివరించాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.

నిన్న నిజామాబాద్ సభలో తెలంగాణ రాష్ట్రం ఆయనతోనే వచ్చింది అన్నట్లు కేసీఆర్ మాట్లాడ్డం విడ్డురంగా ఉందని 1983-99 మధ్య ఏనాడైనా తెలంగాణ ప్రస్తావన కేసీఆర్ నోటినుండి వచ్చిందా అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు.1999 లో చంద్రబాబు క్యాబినెట్ లో మంత్రి పదవి ఇవ్వకపోవడం వల్లనే టిడిపి పై తిరుగుబాటు బావుటా ఎగురవేశారని విమర్శించారు .ఏనాడైనా ఉద్యమ సమయం లో కేటీఆర్,కవిత జైల్లో ఉన్నారా ..? రాజ్యాధికారం లోభాగస్వాములయ్యేందుకు ఉద్యమ ముసుగు ధరించారన్నారు.ఏ విద్యార్ధి , నిరుద్యోగుల ఉద్యమాల ఫలితంగా రాష్ట్రాన్ని సాధించుకున్నామో నేడు అధికారం లోకి వచ్చాక వాళ్ళ ఆకాంక్షల కోసం ఉద్యమిస్తే అణచివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని వర్గాల ప్రజలను టీఆరెస్ పార్టీ మోసం చేసిందని, ఆయా వర్గాలను ఓట్లడిగె నైతిక హక్కు టీఆరెస్ పార్టీ కి ఉందా అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు.  మన ఊరు మన ప్రణాళిక పట్టాలెక్కలేదని, గ్రామా జ్యోతి వెలగకుండానే అదిరిపోయిందని ఎద్దేవా చేశారు. ఎన్.ఆర్.ఈ.జి.ఎస్ , బీఆర్జీఎఫ్ నిధులు లేకుంటే స్థానిక సన్థలు కనుమరుగయ్యేవని ,స్థానిక సంస్థలకు ఒక్క రూపాయి కేటాయించకుండా నిర్వీర్యం చేసిన ఘనత కేసీఆర్ కె దక్కిందన్నారు. అధికారంలోకి రాగానే విద్యార్థులు నెత్తిన చేయ్యిపెట్టిన కేసీఆర్ ,ఒక్కో వర్గం పై చెయ్యి పెడుతూ ,పెడుతూ చివరికి ఎక్కడ పెట్టాలో తెలియక తన నెత్తిమీద తానె చేయ్యిపెట్టుకున్న తెలంగాణ భస్మాసురుడు కేసీఆర్ అని అన్నారు. రాజకీయాల్లో వీడ్కోలు సమావేశం ఉండదని, కొంగర్ కాలన్ సభతో తన వీడ్కోలు సభ తానె నిర్వహించుకున్నదన్నారు. నేటి చేరికలు టీఆరెస్ పతనానికి నాంది అని అన్నారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేశారని , ఇప్పుడు కూడా అదే పునరావృతం అవుతుందని జీవన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు . ఓడిన , గెలిచినా నా జీవితకాలం నిరంతరం ప్రజల మధ్యలోనే ఉంటా , ప్రజల మధ్యలోనే పోతానని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం లో మున్సిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి , వైస్ ఛైర్మెన్ సిరాజుద్దీన్ మన్సూర్ , మాజీ మున్సిపల్ ఛైర్మెన్ గిరి నాగభూషణం , టిపిసిసి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ బండ శంకర్ , పట్టణ అధ్యక్షులు కొత్త మోహన్ , మాజీ జెడ్పిటిసి ముస్కు ఎల్లారెడ్డి , కౌన్సిలర్లు గాజుల రాజేందర్ , పుప్పాల అశోక్ , పిప్పరి అనిత, యువజన నాయకులు రఘువీర్ , హరీష్ , నరేష్ ..రాజేష్ ,గుండా మధు , కొండ్ర రాజేష్ తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు , యువకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు.

Please follow and like us:

You may also like...