ఎస్సి,ఎస్టీ అట్రాసిటీ చట్టం లో మార్పులు…కేంద్రం..!

  • చట్టం లో పలు మార్పులు చేసామని రాష్ట్రాలకు తెలిపిన కేంద్రం
  • ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్ వర్తించదు

ఢిల్లీ/కేంద్ర హొమ్ శాఖ: ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం దుర్వినియోగం కాకుండా ..విచారణ లేకుండా అరెస్టులు కాకుండా చూస్తామంటూ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యాఖ్యలు చేసిన కొద్ది రోజులకే కేంద్రం అన్ని రాష్ట్రాలకు మరో రకమైన ఆదేశాలు ఇచ్చింది. ఎస్సీ ఎస్టీలపై ఏదైనా ఘటన జరిగితే ఎలాంటి విచారణ లేకుండా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని…లేదా అరెస్టుకు ముందు పై అధికారులు అనుమతి తీసుకోవాలన్న నిబంధనను రద్దు చేస్తూ పార్లమెంటు చట్టం చేసిందని తెలుపుతూ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్రపాలిత రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ లేఖలు రాసింది.

ఎన్నికలు జరగనున్న రాష్ట్రంలో ఇంకా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీపై పాత పద్దతినే అవలంబిస్తున్నాయన్న రిపోర్టు కేంద్రం దృష్టికి రావడంతో కేంద్రం ఈ మేరకు లేఖ రాసింది. ముఖ్యంగా ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణలో ఇంకా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పాత చట్టంనే అమలు చేస్తున్నాయి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం చాలా సున్నితమైన అంశం కాబట్టి..గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో దేశవ్యాప్తంగా పలు ఆందోళనలు నిరసనలు చెలరేగాయి. ఈ క్రమంలోనే అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం లేఖ రాసింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం దళితుల ఓట్లకోసమే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం సవరించిందని…అగ్రవర్ణాలు, ఓబీసీల సమస్యలను విస్మరించిందని అగ్రకులాల వారు విమర్శించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగడంతో పార్లమెంటు ఆగష్టు 9న ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని సవరించింది.

సవరించిన కొత్త చట్టం ప్రకారం కొత్తగా సెక్షన్ 18ఏను చేర్చింది కేంద్రం. దీని ప్రకారం ఎస్సీ ఎస్టీలపై దాడులు జరిగితే ఎలాంటి విచారణ లేకుండా సంబంధిత వ్యక్తిని అరెస్టు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సూచించింది. 2017 నేషనల్ క్రైం బ్యూరో సమాచారం మేరకు 2015 నుంచి 2016 మధ్య దళితులపై దాడులు 5.5 శాతానికి పెరిగాయని పేర్కొంది. అంటే 38,670 నుంచి 40,801కి పెరిగినట్లు రిపోర్ట్ స్పష్టం చేసింది. అదే ఎస్టీలపై దాడులు 4.5 శాతం పెరిగాయి. అంటే 6,276 నుంచి 6568కి చేరింది. ఇక దళిత మహిళలపై అత్యాచార కేసులు ఎక్కువగా ఉత్తర్ ప్రదేశ్ (557)లో నమోదవగా… ఆదివాసీలపై అత్యాచారాలు మధ్యప్రదేశ్(377), ఛత్తీస్‌ఘడ్(157), ఒడిషా (91)కేసులు నమోదయ్యాయి

Please follow and like us:

You may also like...