Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

ఎన్నికల రణరంగం

ఎన్నికల వ్యయం తడిపి మోపెడు అవుతున్నది. మరి ఎన్నికల అబ్జార్వర్ల చేతిలో ఉంది అంత చిత్రగుప్తుని రహస్యం.

హైదరాబాదు/బ్యూరో చీఫ్: తెలంగాణ లో ఎన్నికల వేల అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేల ప్రచారం లో అంతా హడావుడే, ఎక్కడ చూసిన హల్చలే చేస్తున్నారు. డబ్బు ప్రాభల్యం తో ప్రజలను బాగానే రోడ్లెక్కిస్తున్నారు. ఈ నేపధ్యం లో ఎక్కడ నామినేషన్ వేసిన పండగే ఎందుకంటే ఆడవాళ్లకు అయితే వచ్చినందుకు రోజు కూలి క్రింద రూ.300 ఇస్తూ, ఉదయం ఫలహారం పెట్టడం, అది కాస్త మధ్యాహ్నం కు జారితే మంచి రుచికరమైన రెస్టారెంట్ భోజనం తో పాటు రాత్రి కి పసందైన డిన్నర్ ఇలా ఆఫర్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనితో పాటు కొందరికి టోకెన్ లు ఇస్తూ ఫలానా రెస్టారెంట్ కు వెళ్ళండి అని పురమాయిస్తున్నట్లు తెలుస్తుంది. దీనితో పాటు నామినేషను కు వచ్చే ఆడవాళ్లు గనుక బతుకమ్మ లు మోస్తూ వచ్చారనుకో ఇగ జై తెలంగాణే, ఎందుకంటే వారికి అక్షరాల రూ.500 నుండి వారి వారి పర్ఫార్మెన్స్ కు తగ్గట్టు అక్షరాలా రూ.2వేల వరకు ఇస్తున్నట్లు గుసగుసలు వినపడుతున్నాయి. దీనితో పాటు ప్రచారం లో భాగం గా వారు చేస్తున్నవి అడుగుతున్న సన్నివేశాలను కళ్ళకు కట్టినట్లు చూపించుకోవడానికి అత్యాధునిక ఫోటో కెమెరాలు, వాటి తో పాటు ప్రొఫెషనల్ వ్యక్తులను వేల రూపాయలకు మాట్లాడుకుని ఔరా అనేట్లు చిత్రాలు సిత్రం గా కనపడేట్లు గానే కాకుండా ఆకట్టుకునే విధం గా దూసుకు పోతున్నారు. ఏది ఏమైనా ఈ సారి ఎన్నికల్లో గెలవడానికి కొందరు ఒక్కో ఓటుకు అక్షరాలా రూ5 వేలు ఇచ్చి అయినా ఓటు వేయించొకోవడం కోసం పెద్ద ఎత్తున స్కెచ్ లు గీస్తూ, ఫైనాన్షియర్లను ఎవరికీ అనుమానం రాకుండా రంగం లో దింపారని తెలుస్తోంది.

Please follow and like us:

You may also like...