ఎన్నికలకు సన్నద్ధం కావాలి…ఎస్పీ సింధు శర్మ..!

జగిత్యాల జిల్లా శాంతి భద్రతలు విఘాతం కలగకుండా రానున్న ఎన్నికలు సజావుగా నిర్వహించే కీలకమైన భాద్యత పోలీసుల భుజస్కందాలపై ఉందని జిల్లా ఎస్పీ శ్రీమతి శ్రీ సింధుశర్మ ఐపీఎస్ అన్నారు.

రాష్ట్రంలో త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో, ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో ఈ రోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో సబ్ డివిజన్ ల వారి గా జిల్లా పోలీస్ అధికారులతో ఎలక్షన్స్ ప్రొసెస్, ఎలక్షన్స్ కోడ్ గురించి, మరియు ఎలక్షన్స్ నియమాల, నిబంధన గురించి ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ యొక్క శిక్షణ కార్యక్రమం లో ఎస్పీ గారు మాట్లాడుతూ .జిల్లా పరిధిలో అయిదు నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుండడంతో అత్యంత పటిష్టాత్మకంగా అనుక్షణం అప్రమత్తతతో ప్రశాంతంగా నిష్పాక్షికంగా ఎన్నికల బందోబస్తు చేపట్టడానికి పక్కా ప్రణాళిక ను ఏ విధంగా సిద్ధం చేసుకోవాలని పోలీస్ అధికారులకు సూచించారు.
ఎన్నికలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరిగిన అందరూ దృష్టి పోలీస్ శాఖపై ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని,ఎన్నికల నియమావళి అతిక్రమించి
ఏ చిన్న పొరపాటు చేసినా ఎన్నికల కమిషన్ తీవ్రంగా పరిగణిస్తుందనే ఆంశాన్ని దృష్టిలో పెట్టుకొని విధులు నిర్వహించాలని సూచించారు .
ఎన్నికలను చాలెంజ్ తీసుకుని రెవెన్యూ శాఖ వారి తో సమన్వయం చేసుకుంటూ టీమ్ గా పనిచేసి ఎన్నికలు విజయవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు.
ప్రతి పోలీస్ సబ్-డివిజన్ పరిధిలో ఎలక్షన్ సెల్ ఏర్పాటు చేయాలని అన్నారు .పోలీస్ స్టేషన్ష SHOs సమస్యాత్మక గ్రామాలు, పోలింగ్ స్టేషన్, పోలింగ్ లోకేషన్ ప్రతి రోజు సందర్శించాలన్నారు. అపరిచిత, అనుమానిత వ్యక్తుల కోసం యధావిధిగా కార్డన్ అండ్ సర్చ్ తో పాటు
సరిహద్దు జిల్లాల నుండి వచ్చే వాహనాలపై నిఘాతో పాటు బస్‌స్టాండు,లాడ్జింగ్ లో ముమ్మరంగా తనిఖీలు చేపట్టాలని అన్నారు.
ప్రధానంగా పట్టణాలలో,
గ్రామీణ ప్రాంతాలలో జరిగే ప్రతి విషయాన్ని తెలుసుకునేందుకు విలేజ్ పోలీస్ ఆఫీసర్ వ్యవస్థతో పాటు నిఘా వ్యవస్థను పటిష్ట పరుస్తునట్లు తెలిపారు .

ఎన్నికలలో భాగంగా జిల్లాకు వీఐపీలు, అదికారులు వస్తుంటారని వారికి రక్షణ చర్యల్లో భాగంగా రోడ్ ఓపెనింగ్ పార్టీలు, కాల్వట్లు ముమ్మరంగా
తనిఖీలు చేయాలని సూచించారు .

సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించి సమస్య ఉత్పన్నం కాకుండా నిరోధించాలని అన్నారు .
గత ఎన్నికల నేపథ్యంలో జరిగిన ఆందోళనలు ఘర్షణలు తరచూ జరిగే ప్రాంతాలలో
వివిధ రాజకీయ పక్షాలు, వివిధ వర్గాల ప్రజలకు ఎన్నికలకు సంబంధించి నిబంధనలపై అవగాహన కల్పించే విధంగా సదస్సులు నిర్వహించాలని తెలిపారు.

ఈ యొక్క సమావేశం లో డీఎస్పీ లు వెంకటరమణా, మల్లారెడ్డి గారు SB డీఎస్పీ సీతారాములు గారు,SB ఇన్స్పెక్టర్ రాజశేఖరరాజు గారు మరియు సీఐ లు ఎస్ఐ లు పాల్గొన్నారు.

Please follow and like us:

You may also like...