ఉద్యమకారులకు అడుగడుగునా అవమానాలే…!

  • ఓటు అనే గుద్దుతో టీఆర్‌ఎస్‌ను తరిమేద్దాం
  • మలిదశ ఉద్యమకారుడు టవర్ మక్బుల్

జోగుళాంబ గద్వాల: గద్వాల నియోజకవర్గంలో ఉద్యమకారులకు అడుగడునా అవ మానాలే జరుగుతున్నాయని ఏనాడూ జెండా పట్టని నాయకులను అందలం ఎక్కించి టిక్కెట్లు ఇస్తున్నారని, కనీసం ఉద్యమంలో పాల్గొని జేండాలు మోసిన ఉద్య మకారులకు కనీస గుర్తింపు కూడా లేదని, అలాంటి టీఆర్‌ఎస్ పార్టీని ఓటు అనే గుద్దును హస్తం గుర్తుకు గుద్ది టీఆర్‌ఎస్ నాయకుడు కేసీఆర్‌ను గద్ధెదింపి ఇంటికి పంపుదామని మలిదశ ఉద్యమకారుడు, టవర్ మక్బుల్ అన్నారు. తెలంగాణలో ఎక్కడ ఉద్యమం జరిగినా అక్కడ వాలిపోయి జెండా పట్టుకున్నామన్నారు. వంటావార్పు, బంద్‌లు, మార్చ్ మిలియన్ ఇలా ఎన్నో రాష్ట్రస్థాయి ఉద్యమాలలో పాలు పంచుకొని గద్వాల నియోజకవర్గంలో తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోశామన్నారు. కానీ నేడు ఉద్యమకారులను టీఆర్‌ఎస్ పెద్దలు పట్టించుకోవడం లేదన్నారు. ఉమ్మ డి పాలమూరు జిల్లాగా ఉన్నప్పుడు తెలంగాణ ఉద్య మాన్ని గద్వాల నియోజకవర్గంలో పట్టుమని పది మందితో ప్రారంభించి జెండాలు మోసి రోడ్లపై ధర్నా లు, రాస్తారోకోలు చేసి అప్పటి ప్రభుత్వాల దిష్టిబొ మ్మలు దగ్ధం చేశామన్నారు. ఉద్యమంలో భాగంగా ఉద్యమ నాయకులు ఏ పిలుపును ఇచ్చినా వెనక్కి తగ్గ కుండా పోలీసులకు బెదరకుండా పదిమందిమి ఉన్నా, నలుగురం ఉన్నా ఏ కార్యక్రమాన్ని కూడా వదలకుం డా ఉద్యమాన్ని నడిపించామన్నారు. కానీ నేడు ఏనా డూ ఉద్యమ జేండా పట్టని వారు నేడు పదవులు అను భవిస్తుంటే కడుపు రగిలిపోతుందన్నారు. కనీస మర్యాద లేకుండా ఉద్యమకారులను రోడ్లపైకి తీసు కొచ్చిన ఘన చరిత్ర టీఆర్‌ఎస్ పార్టీకే చెందిందన్నారు.

జిల్లా ఉద్యమంలో సైతం…

తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని అంద రికీ చుక్కలు చూపించిన టవర్ మక్బుల్ జోగుళాంబ గద్వాల జిల్లా కావాలని కూడా అదే స్థాయిలో ఉద్య మాన్ని కొనసాగించారు. రాజీవ్‌మార్గ్ చౌరస్తాలో ఉన్న టవర్‌ను ఎక్కి జిల్లా ప్రకటించకపోతే ఆత్మహత్య చేసు కుంటానని దాదాపు ఆరుగంటల పాటు హల్‌చల్ చేశారు. అప్పటి నుంచే తెలంగాణ ఉద్యమకారుడిగా ఉన్న ఆటో మక్బుల్‌కు టవర్ మక్బుల్‌గా పేరు వచ్చిం ది. జిల్లా అధికారులు వచ్చి జిల్లా ఏర్పాటుకు నివేదిక చేస్తుందని, ప్రభుత్వం పరిశీలిస్తుందని, టవర్ ఎక్కిన విషయాన్ని రాష్ట్ర అధికారుల దృష్టికి తీసుకెళ్లామని అప్పటి ఆర్డీఓ హామీ ఇవ్వడంతో ఆయన కిందకు దిగాడు. జిల్లా ఉద్యమంలో టవర్ ఎక్కి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఎంపీపీ మాటలు బాధించాయి..

ఉద్యమ సమయంలో ఉన్న తమను పార్టీ వాడు కోకుండా ఉండటంతో చేసేది లేక ఇతర పార్టీలలోకి వెళ్తున్నామన్నారు. కానీ టీఆర్‌ఎస్ పార్టీ తరపున గెలిచిన ఎంపీపీ మాటలు తనను ఎంతగానో బాధిం చాయన్నారు. తాము గెలిచిందంటే ఉద్యమం వల్ల కాదని, రూ.16లక్షలు పెడితే ఎంపీటీసీగా గెలుపొంది ఎంపీపీని అయ్యానని, ఉద్యమకారుడిగా ఉండి వార్డు మెంబర్‌గా కూడా గెలవలేవని, ఈ ఉద్యమాలు, పార్టీలు కూడు పెట్టవని వచ్చి అడిగి పని చేసుకుంటూ పోవాలే కానీ ఉద్యమకారులము మమ్మలను పిలవా లంటే ఎలా అని అవహేళన చేస్తూ మాట్లాడారని ఆ యన వాపోయారు.

ఆనాడు ఉద్యమం చేసి ఉండక పోతే ఈనాడు మీకు పదవులు వచ్చేనా..? వచ్చిన పదవులను అనుభవించుకుంటూ మళ్లీ ఉద్యమకారు లను ఛీదరించుకోవడం ఏమిటని ఆయన ప్రశ్నించా రు. నామినేటెడ్ పదవులైన మార్కెట్ కమిటీ చైర్మన్ ప దవులు కానీ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవి కానీ, డైరెక్టర్ పదవులు ఏవైనా సరే ఉద్యమకారులకు ఇచ్చా రా..? అని ఆయన ప్రశ్నించారు. ఉద్యమ సమయంలో కనిపించిన ఉద్యమకారుల నేడు డబ్బున్న వారు కావాల్సి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్లపైకి రానివారు, కేసీఆర్ కుటుంబంలో నలుగురికి పదవులు వచ్చాయని, జెండా పట్టనివారికి టిక్కెట్లు, పదవులు ఇస్తున్నారని, జెండాలు మోసిన వారి పరిస్థితి మాత్రం అగమ్యగోచరంగా మారిందన్నారు.

Please follow and like us:

You may also like...