ఉచితంగా పంపిణీ..!

మట్టి ప్రతిమలను పూజిద్దాం… పర్యావరణాన్ని కాపాడుదాం.

హైదరాబాద్‌: ‘ఎకో ఫ్రెండ్లీ వినాయక ప్రతిమలను పూజించండి.. పర్యావరణాన్ని పరిరక్షించండి..’ అన్న నినాదంతో జీహెచ్‌ఎంసీ మట్టి విగ్రహాల పంపిణీకి శ్రీకారం చుడుతోంది. ఇప్పటికే ప్టాస్టిక్‌ నిషేధంపై కసరత్తు ప్రారంభించిన సంస్థ.. ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ విగ్రహాలతో జల వనరులు కలుషిత మవుతున్నాయన్న అంశంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని నిర్ణయించారు.

ఈ క్రమంలో 20వేల విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన టెండర్‌ ప్రక్రియ పూర్తయ్యిందని, ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటుచేయడంతోపాటు, కాలనీ సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ద్వారా పంపిణీ చేపడతామని కమిషనర్‌ దానకిషోర్‌ తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు ప్రజలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Please follow and like us:

You may also like...