ఈసీ వద్దకు తెలంగాణ సర్కారు…!

కమిషనర్‌ లావాసాతో రాష్ట్ర ప్రతినిధుల భేటీ
రాష్ట్రంలో ముందస్తు సాధ్యాసాధ్యాలపై చర్చ
3 రాష్ట్రాలతో కలిపి జరపడంపై మంతనాలు
ఎప్పుడు రద్దు చేస్తే సరిపోతుందని ఆరా
లోక్‌సభ ఎన్నికలు ఎప్పుడొస్తాయని ప్రశ్న
ముందస్తు కష్టమేనంటున్న మూడో కమిషనర్‌
మెజారిటీ నిర్ణయంతో నెగ్గుతుందని ఆశ
ఏజీతోనూ న్యాయ పరమైన అంశాల చర్చ
న్యూఢిల్లీ : తెలంగాణలో ముందస్తు ఎన్నికల సాధ్యాసాధ్యాలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు ఎన్నికల సంఘంతో చర్చించారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు నిర్వహించడానికి తమకు అభ్యంతరం లేదని, ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని ఎన్నికల సంఘం వర్గాలు సంకేతాలు ఇచ్చాయని తెలుస్తోంది. మౌలిక సదుపాయాలు, భద్రతా పరమైన ఏర్పాట్ల విషయమై ఇబ్బంది లేదనే అభిప్రాయంలో మెజారిటీ కమిషనర్లు ఉన్నట్లు భోగట్టా.

గురువారం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌ శర్మ, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి కేఎం సాహని ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిషనర్‌ అశోక్‌ లావాసాతో భేటీ అయ్యారు. ఈ భేటీలో తెలంగాణ భవన్‌ అదనపు రెసిడెంట్‌ కమిషనర్‌ వేదాంతం గిరి కూడా పాల్గొన్నారు. కొద్ది రోజులుగా ఢిల్లీలోనే ఉండి రాజీవ్‌ శర్మ ముందస్తు ఎన్నికలపై కసరత్తు చేస్తున్నారు. గురువారం మధ్యాహ్నం ముగ్గురూ కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయానికి వెళ్లి కమిషనర్‌ అశోక్‌ లావాసాతో సమావేశమయ్యారు. ముందస్తు ఎన్నికలపై ఆయన అభిప్రాయం తీసుకున్నారు.

Please follow and like us:

You may also like...