ఈవీఎం ద్వారా ఓటును వినియోగింపుకు అనుమతి …!

ఈరోజు సచివాలయం లోని అడిషనల్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ శ్రీమతి సత్య వాణి గారిని కలిసిన టీపీసీసీ స్పోక్ పర్సన్ గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి మరియు దేవరకద్ర నియోజక వర్గ కాంగ్రెస్ నాయకులు G మధుసూదన్ రెడ్డి అడ్వకేట్,(జీఎంఆర్).

ఈ సందర్భంగా “ఎన్నికలలో పాల్గొనబోయే ఉపాధ్యాయులు మరియు ఉద్యోగులు గతం లో పోస్టల్ బ్యాలెట్ ను ఉపయోగించేవారు. దాని వల్ల వారి ఓటును స్థానికంగా పోటీ చేసిన అభ్యర్థులు ఒత్తిడి చేయడమో , డబ్బులు ఎర చూపడమో, లేదా మొహమాట పెట్టడమో జరుగుతుండేది. దాని వల్ల ఉద్యోగికి ఓటుపై ఆసక్తి తగ్గేది. తద్వారా ప్రజా స్వామ్య ప్రక్రియలో ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు ఓటును సద్వినియోగ పరుచుకోలేకపోయేవారు.
కావున రేపు జరగబోయే ఎన్నికలలో వీరు ఏ నియోజకవర్గానికి చెందిన వారైతే ఆ నియోజకవర్గంలో తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేయడానికి ఎన్నికల విధుల్లో పాల్గోనకముందే వారు ఈవీఎం  ద్వారా తమ ఓటును వినియోగించుకునేందుకు ఆన్ డ్యూటీ సౌకర్యం కల్పిస్తూ అనుమతి ఇవ్వగలరని” కోరారు.

అదేవిధంగా ఓటర్ నమోదులో పలు అక్రమాలు ఒకే ఇంటి నెంబర్ పై వందల ఓటర్ కార్డులు పుట్టించడం పైన సమగ్ర దర్యాప్తు చేయవలసిందిగా కోరడం జరిగింది.

Please follow and like us:

You may also like...