ఇది కథ కాదు….హృదయ విదారక వ్యధ..!

జగిత్యాల/కొండగట్టు: నాన్న నేను వస్తున్నా కొండగట్టు నుండి…….! నన్ను చాపలో చుట్టారుగ నాన్న!!

మూడు సంవత్సరాల బాలుని అంతర్మథనం వినండి ఒకసారి.

చాలా నొప్పి నాన్న….. నన్ను పోస్టుమార్టం చేశారు కదా..


నాకు చిన్న గాయం అవుతేనే, నువ్వు తట్టుకోలేవు. మరి ఇప్పుడు మాంసము ముద్దలు…ముక్కలు, ముక్కలు గా కోసి నన్ను చాపలో చుట్టి తెస్తున్నారునాన్న ఎలా చూస్తావు.

నువ్వు బండి మీద వేళదాం రా… అంటే అమ్మనే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితం అని నన్ను ఒక్కడినే ఇలా తీసుకవచ్చింది.

కానీ ఏం లాభం నాన్న బస్ అంకుల్ నన్ను మరియు మేము ఉన్న బస్సును మొత్తం బోర్లపడేసాడు…

అయిన సరే నాన్న నేను బ్రతికే ఉన్నాను…
మా నాన్నను చూడాలి అని ఆలపిస్తూనే ఉన్నాను. కానీ అప్పటికే నా చేతులు రెండు విరిగి పోయి, వెన్నుపూస రెండుగా చీలి పోయి, కళ్ళు మాత్రం మొత్తం రక్తంతో స్రవిస్తూనే ఉంది…

అయిన సరె నాన్న నిన్ను చూడాలి అన్న తపన తో ఇంకా బ్రతికే ఉన్నాను…కానీ అప్పటికే నా తల పగిలి చెవులలో నుండి రక్తం కారుతుంది, అయితే ఏంటి నాన్న బ్రతకాలి అని తీవ్రంగా సంకల్పం తో ఉన్నాను…

అప్పటికే , ఒక్కరు, ఒక్కరు గా వచ్చి మమ్మల్ని బయటకు తీయడం ప్రారంభించారు నాన్న…

అప్పుడు అనుకున్నాను నాన్న నేను ఎలాగైనా బ్రతుకుతాను అని,10 నిమిషాల్లో 108 అంబులెన్స్ వస్తది అని చాలా సేపు ఊపిరి బిగపట్టాను నాన్న నీ కోసం కానీ, 108 తీసి వేశారు గా ముప్పావు గంట దాకా అంబులెన్స్ రాలేదు నాన్న…అప్పటికే, నాకు మసక చీకట్లు వస్తున్నాయి కానీ ఏం చేయను నాన్న, అప్పుడు నన్ను అంబులెన్స్ లో ఎక్కించారు.నన్ను అంబులెన్స్ లో ఎక్కించి దవాఖానకు తరలిస్తున్నారు, నేను నీకు కాల్ చేయమని అడుగుదాం అనుకున్నాను కానీ నాన్న, నా నోటిలోంచి అప్పటికె మాటలకు బదులు రక్తం వస్తుంది.అయిన సరే నాన్న, నిన్ను చూస్తాను అన్న ఆశ మాత్రం తగ్గలేదు.ప్రాణాలతో పోరాడుతూనే ఉన్నాను…

అప్పుడు అనుకున్నాను కొండగట్టు దగ్గర మల్యాల మండలం లో 30 పడకల దవాఖానకు తీసుకెళ్తారు అనుకున్న కానీ నాన్న నన్ను 40 km దూరంలో ఉన్న కరీంనగర్ కు తీసుకెళ్లారు అక్కడ ప్రభుత్వ దవాఖానలో మందులు తక్కువ అని హైదరాబాద్ కు తరలిస్తున్నారు.

ఇప్పుడు ఏం చేయాలి నాన్న నువ్వు చెప్పు ఇన్ని నొప్పులు బరిస్తూ బ్రతకాలా లేక చనిపోవాల.
బరిద్దాం అని ఉంది నాన్న కానీ చిన్న పిల్లవాడిని కదా మూడేళ్లు మాత్రమే, ఒక్క చిన్న ముళ్లు గుచ్చుకుంటనే మూడు రోజులు ఏడ్చే వయస్సు నాది అలాంటిది
శరీరం అంతా ముక్కలు అయ్యింది అయిన పోరాడుతున్న నేను కానీ,
నాన్న నా పరిస్థితి ఇలా ఉంది.

రక్తపు మడుగులో, పుట్టెడు నొప్పులతో అడుగుతున్న నాన్న మిమ్మల్ని ఒక్క ప్రశ్న!
చెప్పండి జవాబు!!

మొన్ననే అన్నావు కదా నాన్న, ఓట్ల పండుగ వచ్చింది మన బ్రతుకులు మారుతాయి అని, నేను పుట్టక ముందు కూడా అమ్మతో ఇదే మాట చెప్పావ్ అట అప్పటి ఓట్ల అప్పుడూ,మనకు ఏంటి అని నాన్న కళ్ళు ముసుకపోతున్నాయి చెప్తూఉంటే నీకు,అయిన సరే విను నా చివరి మాటలు ఇక నైనా నీ లాంటి వారు, నాన్ననువ్వు కూడా కొంచెం సిగ్గు తెచుకోండి.

విను నాన్న,ఇవ్వాళ నా ఈ ముళ్ళ పానుపుకు కారణం ఎవరు నాన్న, నేను ఇలా కొన ఊపిరితో కొట్టుకోవడానికి కారణం ఎవరు.డ్రైవర్ అంకుల్ కావొచ్చు, అని అతణ్ణి ప్రాణం పోయే ముందు అందరూ ఆర్తనాదాల తో అడిగారు. నువ్వు మా ప్రాణాలు పోవడానికి కారణం అని ,కానీ ఆయన ఏం చెప్పాడో తెలుసా నాన్న మాతో, మీ ప్రాణాలు పోవడానికి నేను కారణం అవుతే మరి నా ప్రాణాలు పోవడానికి ఎవ్వరు కారణం అని. అప్పుడు అందరం కలిసి ఆ బస్ను మరియు ఆ రోడ్డును అడిగాం,మా ప్రాణాలు పోవడానికి మీరు కారణమా అని అప్పుడు వాళ్ళు ఏం చెప్పారో తెలుసా.మాకేం తెలుసు, మమ్మల్ని పరిశీలిస్తున్న అధికారుల్ని అడగండి అని అనడం తో,వాళ్లను అడిగే ముందు మీరు ఇంత సేపు ఇక్కడ ఈ అనవసరపు ఆర్తనాదాలు తీసే బదులు అంబులెన్స్ లో హాస్పిటల్ కి పోరా అని, కానీ అంబులెన్స్ వస్తే కదా అన్నారు. సరే నాన్న, ఇంతలో అధికారులు వచ్చారు ఏవేవో కాగితాలు పట్టుకొని హడావుడి చేస్తున్నారు అప్పుడూ అడిగాము మీ తప్పు వల్లనే మేము ఇలా పడి ఉన్నాము అని కానీ,

వాళ్ళు ఏమన్నారో తెలుసా నాన్న ఎవరో, ప్రభుత్వం చేసిన తప్పుకి మమ్మల్ని ఎందుకు భాధ్యులను చేస్తారు, 60 మంది పోయే బస్సులో 80 మందిని ఎక్కిస్తే పాపం డ్రైవర్ మాత్రం ఏం చేస్తాడు.బస్సుల కొరత వల్ల ఇలా చేయాల్సి వచ్చింది అని అనే అంత లోపల చూసే సరికి ఇంతలో అంబులెన్స్ వచ్చినది అందులో ఎక్కాము.అప్పుడు అడిగాము ఒకప్పుడు 10 నిమిశాల లోపు వచ్చే మీరు ఇంత టైం ఎందుకు పట్టింది అని. అప్పుడు వాళ్ళు చెప్పారు,ఏంటంటే ఇప్పుడు 108 లాంటి ఉచిత వైద్య సేవలు లేవు కద అది మా తప్పు కాదు ప్రభుత్వం తప్పు అని మల్ల వాళ్ళు కూడా ప్రభుత్వం మీద తోసేశారు.

ఇంతలో, కరీంనగర్ ప్రభుత్వ దవాఖానకు వచ్చాం.ఇక్కడ డాక్టర్లు మా నాడి పట్టుకొని చూసి…
మనకు కావాల్సిన వైద్య సౌకర్యాలు లేవు ఇక్కడ హైదరాబాద్ తరలించండి అన్నారు.వాళ్లను అడిగాము, ఇంత పెద్ద దవాఖాన ఇక్కడ ఉండగా హైదరాబాద్ నిమ్స్,ఉస్మానియా, గాంధీ, ఎందుకు అని.వాళ్ళు ఏమి చెప్పారంటే, ఆ సౌకర్యాలు లేకపోవడం మా తప్పు కాదు, ప్రభుత్వం తప్పు అని.అది సరే అని, హైదరాబాద్ కి అంబులెన్స్ లో ఎక్కించ బోతుంటే, ప్రభుత్వ పెద్దలు అక్కడికి వచ్చారు.వాళ్ళనూ అడిగాము, బస్సు ఫిట్నెస్ లేకపోవడం, రోడ్డు అనుమతి, 108 అంబులెన్స్, వైద్య పరికరాల లేమి ఇవన్నీ మీ తప్పే , మీరే ఇవ్వలేదు అవసరం ఉన్నటువంటివి. మీ లోటు పాట్ల వళ్లనే అని అధికారులు అంటున్నారు. మీకు ప్రజలు అన్న వారి ప్రాణాలు అన్న విలువ లేదా? దేనికి మీ సమాధానం ఏమిటీ అని అడగడం తో ఎం చెప్పారో తెలుసా. నాన్న బాధ పడకండి, మీకు మనిషికి 5 లక్షల రూపాయలు ఇస్తాము మరణించిన తరువాత, అదే విధంగా మా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తాము.అలాగే మా మంత్రులు ట్విట్టర్ లో,ఫేస్ బుక్కుల్లో,వ్వాట్సాప్ లో పోస్టు పెడుతారు
కానీ,కొత్త బస్సులు మాత్రం వేయం, అవే పాత బుస్సు లలో ప్రయాణించండి.అలాగే

 • రోడ్లు మాత్రం సరి చేయం అవే గుంతలు పడ్డ రోడ్ల మీద చావండి
 • ఏ ప్రమాదానికి కారణం అయిన ఏ ఒక్క అధికారి పైన చర్యలు తీసుకోమ్ ఎందుకంటె పోయే మీ కంటే ఉన్న వాళ్ళ ఓట్లు ముఖ్యం.
 • మండల, జిల్లా కేంద్రంలో నాణ్యమైన వైద్యం ఎప్పటికి అందనివ్వము ఎందుకంటే మాకు ప్రైవేటు హాస్పిటల్స్ ముఖ్యం.

అప్పుడు మేము అంత ఏడుస్తూ అన్నాము. సార్ మరి ప్రజలు మిమ్మల్ని ఎమ్ అనరా  అని అనడం తో

ఇప్పటి వరకు చెప్పినవన్నీ చేయకుంటే ఏం అన్నారు, ఇప్పుడు ఏం అంటారు.

 • వ్యవసాయ నికి నీళ్లు ఇవ్వకుండా, అరచేతిలో ప్రాజెక్ట్ లు చూపెట్టి 6 కిలోల బియ్యం ఇస్తే…
 • కె జి టూ పి జి ఉచిత నిర్బంధ విద్యకు బదులు ఉన్న ప్రభుత్వ పాఠశాలలు మూసి వేసి నాలుగు మోడల్ స్కూల్స్ పెడితే…
 • గుడిసె లేకున్నా కానీ, మినరల్ వాటర్ ఇస్తే…
 • పత్తి కి ధరలు పెంచకున్న కానీ, కట్టుకోవడానికి 100rs చీరెలు ఇస్తే
 • చదువుకు బదులు వాళ్ళ పిల్లలకు బర్లు, గొర్లు, చేపలు ఇస్తే

ఎవరన్నా అడుగుతున్నారా….? అవ్వి కాసుకుంటా బ్రతుకుతున్నారు కానీ ,మాకు….

కూడు,గూడు, గుడ్డ, చదువు, ఆరోగ్యం ఉచితంగా ఇవ్వండి అని అడిగే వాళ్ళు ఎందరు.

ఒకవేళ పొరపాటున ఎవ్వరన్న ప్రశ్నిస్తే మీకు పట్టిన గతే వాళ్ళకు కూడా పడుతది.

అని, చెప్పారు నాన్న.

ఇప్పటి వరకు నా ఊపిరి ని అంతటిని ఆపుకోని నిన్ను చూడాలి అని బ్రతికిన నాన్న కానీ, ఈ మాటలు విన్నాక బ్రతకడం కంటే చావడమే నయం అని నిన్ను వదిలేసి పోతున్న నన్ను క్షమించండి నాన్న.

కానీ ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకో నాన్న నువ్వు ఎవ్వరన్న, ఓటు వేయమని 500రూ.లు, బీరు సీసా, చీర, పట్టుకొని వస్తే చెప్పులు మర్లేసి కొట్టు వాణ్ణి.

మనం అమ్ముడు పోయి బ్రతికినంత కాలం నాలాంటి వాళ్ళు ఎందరో ఇలా బలై పోవాల్సి వస్తది…

ఆ డబ్బులకు బదులు,…

 • 1.ఉచిత వైద్యం అడుగు నాన్న!
 • 2.ఇంగ్లిష్ మీడియం ఉచిత విద్య అడుగు, అది మెడికల్ అయిన ఇంజినీరింగ్ అయిన కె జి టూ పి జి వరకు
 • 3.వ్యవసాయానికి నీళ్లు అడుగు,పంటకు మద్దతు ధర

ఈ మూడు చాలు ప్రజలే ఇస్తారు ప్రభుత్వం కి డబ్బులు అప్పుగా , మనకు బ్యాంక్ లోనులు ఎందుకు నాన్న వాళ్ళు మాఫీ చేసేది.మనమే చేద్దాం మాఫి వాళ్లకు.

కానీ,నువ్వు మారవు నాన్న ఏదో ఒక పార్టీ కి గులాం వు అయ్యి బ్రతుకుతావు అని నాకు తెలుసు.

కానీ ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకో నాన్న, నాయకులు బయటకు ఎంత తిట్టుకున్న
వాళ్ళు ఏ పార్టీ లో ఉన్న అందరూ ఒక్కటే. ఎమ్మెల్యేలు, ఎంపి లు కాకుండా, కింది స్థాయి వాళ్ళు మాత్రమే కొట్టుకుంటూ ఉంటారు.

మరి అలాంటప్పుడు, ఒక మధ్యతరగతి మనుషులుగా, సామాన్య వ్యక్తులు గా మనం ఎందుకు కలసి కట్టుగా ఉండకుండా,ఎవ్వని బాగు కోసమో, వాని జెండా మోస్తూ ఈ నరకయాతన అనుభవిస్తున్నాము.

అందుకే నాన్న ఇక సెలవు!

నా చావుతో అయిన ఈ సమజానికి కదలిక వస్తుంది అనుకుంటున్నా.

నరాలు అన్ని తెగిపోయాయి కదా నాన్న, రక్తం మొత్తం ఆవిరై పోయింది.అందుకే నిన్ను చూడకుండా చనిపోతున్న,నన్ను పోస్టుమార్టం చేసి, చాపలో పెట్టి తెస్తున్నారు గా ఏడువకు ఇక నువ్వు .

“”మేధావులు, విద్యావేత్తలు, విజ్ఞానవంతులు, ప్రతి ఒక్కరు గమనిచండి. ఒక సామాన్య వ్యక్తిగా,అభం , శుభం తెలియని ఆ చనిపోయిన 3 సంవత్సరాల బాబు స్థానంలో ఉండి నా ఆలోచనను తెలియజేశాను కానీ, ఏ ఒక్క రాజకీయ పార్టీనో, వ్యక్తినొ విమర్శించడం అసలు ఉద్దేశ్యం కాదు.

Please follow and like us:

You may also like...