ఇంత తాత్సారమా నా అల్లుడి టికెట్టుపై అవసరమా ?

  • నా అల్లుడికి ఇవ్వడం కుదరకపోతే నాకైనా ఇవ్వండి : నాయిని
  • టికెట్ కోసం రెండు సార్లు కేటీఆర్ ని కూడా కలిసాను…

హైదరాబాద్:సీఎం కేసీఆర్ కు నువ్వు చాల దగ్గర కాదన్నా…జర గా ముషీరాబాద్ టికెట్ మీ అల్లుడు శ్రీనివాస్ రెడ్డి కి వస్తుందా లేదా? అని పార్టీ ల తిరిగే నాయకులూ,కార్యకర్తలు,ఇంకా మా చుట్టాలు అడుగుతూ ఉంటే లేదేమో అనిపిస్తుంది.అప్పుడప్పుడు మనసు కలుక్కు మంటుంది.కాని ఎం చేయను ఆయన ఏం అనుకుంటున్నారో అంటూ హోమ్ మంత్రి నాయిని నర్సింహా రెడ్డి వాపోయారు.గురువారం ఓ కార్యక్రమం లో మంత్రి ని విలేకర్లు ప్రశ్నించగా ముషీరాబాద్ టికెట్ గురించి ఆరా తీశారు.ఈ సందర్బంగా ఆయన మనసులో దాగి ఉన్న ముచ్చట చెప్పుకొచ్చారు.ముషీరాబాద్ టికెట్ తన అల్లుడు శ్రీనివాస్ రెడ్డి కి ఇవ్వడం లో సీఎం కేసీఆర్ కు ఏమైనా ఇబ్బంది గా ఉంటే అల్లుడుకికి బదులుగా నాకిచ్చిన పోటీ చేస్తానని మంత్రి స్పష్టం చేశారు.నియోజకవర్గం లో పని చేసుకోమని శ్రీనివాస్ రెడ్డికి యాడాది క్రితమే చెప్పారని ఆ విషయం గుర్తు చేశారు.తన అల్లుడి టికెట్ విషయం ను పురస్కరించుకుని మంత్రి కేటీఆర్ ని రెండు పర్యాయాలు కలిశానని చెప్పుకొచ్చారు.తనతో మాట్లాడిన తరువాతే ముషీరాబాద్ నియోజకవర్గం నియోజకవర్గం టికెట్టుపై నిర్ణయం తీసుకుంటానని స్వయంగా కేసీఆర్ చెప్పారని తొందర పాటు వొద్దని భరోసా ఇచ్చారని ఆయన చెప్పుకొచ్చారు.నాడు 2014లో తానూ ముషీరాబాదు నియోజకవర్గం నుండి పోటీ చేస్తానని అంటే ‘వద్దే నర్సన్న’ గతం లో నిన్ను ఓడగొట్టినారు కాదనే నా మాట విని నువ్వు ఈసారి నువ్వు గా ఎల్బీ నగర్ నుంచి పోటీ చేయమని స్వయం గా కెసిఆర్ చెప్పారని గుర్తు చేశారు.బాగా పైసాలున్న సుధీర్ రెడ్డి మీద నువ్ పోటీ చేయలేనంటే నీ తమ్ముని నేనున్నా అని రూ. 10 కోట్లు నేనే ఇస్తానని పోటీ చేయమని అన్న సంగతి గుర్తు చేసారు.

Please follow and like us:

You may also like...