ఇంటేలిజేన్స్‌ ఆద్వర్యం లో ఒక రోజు శిక్షణ….!

జగిత్యాల జిల్లా……

సిబ్బంది విధినిర్వహణ లో అనుక్షణం ఆప్రమత్తతతో విధులు  నిర్వహించాలని జిల్లా ఎస్పీ శ్రీమతి శ్రీ సింధుశర్మ ఐపిఎస్ గారు సిబ్బందికి సూచించారు.

రాష్ట్ర పోలీస్‌ ఇంటేలిజేన్స్‌ సేక్యూరీటీ విభాగం ఆద్వర్యం లో జిల్లా ఆర్మూడ్‌ విభాగానికి వ్యక్తిగత భద్రత అధికారులు, డిస్ట్రిక్‌ గార్డ్స్‌ మరియు ఆర్మూడ్‌ విభాగం సిబ్బందికి ఒక రోజు శిక్షణ తరగతులను ఏర్పాటు చేసారు.

రాష్ట్రం లో రాబోతున్న ఎలక్షన్స్ ను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర పోలీస్‌ విభాగం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వ్యక్తిగత భద్రత అధికారులుగా విధులు నిర్వహించే సిబ్బందితో పాటు ఇతర ఆర్మూడ్‌ విభాగానికి పోలీస్‌ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ తరగతులను ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఇందులో భాగం గా జిల్లా పరిధిలో ఈ శిక్షణ తరగతులను ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ తరగతుల్లో వ్యక్తి గత భద్రత అధికారులు తాము భద్రత కల్పిస్తున్న టార్గేట్‌ వ్యక్తులకు శత్రువుల నుండి రక్షణ కల్పించడంతో పాటు ప్రతిదాడితో ఏవిధంగా భద్రత కల్పించాల్సి వుంటుంది. ఇందుకోసం పోలీస్‌ సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు, టార్గేట్‌పై శత్రువులు దాడికి పాల్పడినప్పుడు ప్రతిదాడి చేసే విధానం, అనుసరించాల్సిన ప్యూహలను ఈ శిక్షణ తరగతుల్లో అధికారులు సిబ్బంది వివరించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య ఆతిధిగా హజరయిన ఇంటెలిజెన్స్ డి. ఎస్. పి వాసుదేవ రెడ్డి గారు సిబ్బందిని ఉద్యేశిస్తూ మాట్లాడుతూ  గతంలో అధికంగా నక్సలిజం ప్రాభల్యం వున్న కరీంనగర్ జిల్లాలో ఎంతో మంది పోలీసులు అధికారులు, సిబ్బంది ప్రాణ త్యాగాలతో పాటు, ప్రస్తుతం వున్న ఎంతో మంది అధికారులు, సిబ్బంది

సమర్థవంతంగా పనిచేయడం ద్వారానే నేడు పూర్వ కరీంనగర్ జిల్లాలో లో ప్రశాంతత నెలకోందని, ఈ వాతావరణాన్ని కోనసాగించాలంటే ఇకపై మరింత మెరుగైన శిక్షణ పోందిన క్షేత్ర స్థాయిలో విధులు నిర్వహించడం ద్వారా ఎలాంటి సమస్యలు రావని తెలిపారు

ఈ కార్యక్రమంలో AR DSP ప్రతాప్ గారు,RI అడ్మిన్ రామారావు గారు,MTO నవీన్ గారు,RSI శ్రీనివాస్ గారు, ఇంటెలిజేన్స్‌ సేక్యూరీటీ విభాగం అధికారులు ఇతర పోలీసు సిబ్బంది పాల్గోన్నారు.
Please follow and like us:

You may also like...