ఆలేరులో గెలుపు ఖాయం…మోత్కుపల్లి!

యాదాద్రి భువనగిరి జిల్లా/ ఆలేరు :ఆలేరు నుండి పోటీ చేస్తున్న తనను ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపించడం  ఖాయమని మోత్కుపల్లి నర్సింహులు ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో ఆయన తన జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఇక్కడి నుండి గెలిచిన ఎమ్మెల్యే లు ముగ్గురు అసమర్థులని ఆలేరు ను అభివృద్ధి చేయలేక పోయారని గతంలో తను మంత్రిగా,ఎమ్మెల్యే గా చేసిన అభివృద్ధి తప్ప కొత్తగా వారు చేసింది ఏమి లేదని అన్నారు. అందుకే ప్రజలు తనను పోటీ చేయాలని బలంగా కోరుకుంటున్నారు అన్నారు. గత నెల జరిగిన సభకు 30 వేల ప్తె చిలుకు మంది సభ కు హాజర్తె తనను ఆశీర్వదించారని అన్నారు.గెలిచాక గోదావరి జలాల కోసం పోరాడుతానని చెప్పారు. ఈ సమావేశంలో ఆయన అభిమానులు అమరేందర్ రెడ్డి, ఎండి సలీమ్ తో పాటు ఎమ్మార్పీఎస్  నాయకులు పాల్గొన్నారు.అనంతరం 100 మంది వివిధ పార్టీల వారు ఆయన సమక్షంలో మోత్కుపల్లి యువ సేన లో చేరారు.

Please follow and like us:

You may also like...