Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

ఆయేషా మీరా హత్య కేసు సిబిఐ కి….హై కోర్ట్!

  • ఆయేషా మీరా హత్య కేసులో కీలక మలుపు చేరుకుంది.
  • సీబీఐకి అప్పగించాలని హైకోర్టు ఆదేశాలు.
హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్న డాగ్ స్క్వాడ్ బృందం.
దాచిన చిత్రం

విజయవాడ: ఆయేషా మీరా హత్య కేసు కీలక మలుపు తిరిగింది. కేసు రికార్డులన్నీ ద్వంసం అయ్యాయని హైకోర్టుకు సిట్ (ప్రత్యేక దర్యాఫ్తు బృందం) తెలిపింది. అయితే కేసు నడుస్తున్న సమయంలో ఈ కేసుకు సంబంధించిన రికార్డులు ధ్వంసమయ్యాయని సిట్ తెలిపింది. రికార్డుల ధ్వంసం పైన హైకోర్టు విచారణకు ఆదేశాలు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా నివేదిక సమర్పించాలని రిజిస్టర్ జనరల్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసు పైన రాష్ట్ర పోలీసుల కన్నా సీబీఐ చేత దర్యాప్తు చేయిస్తే మేలని హైకోర్టు అభిప్రాయపడింది. ఈ నేపధ్యం లో సీబీఐను సుమోటోగా ప్రతివాదిగా హైకోర్టు చేర్చింది. ఇది ఇలాగ ఉండగా, ఆయేషా మీరా హత్య కేసులో ఏళ్లుగా విచారణ సాగుతున్న విషయం మన అందరికి తెలిసిన విషయమే. ఈ కేసులో అసలు దోషిని పట్టుకునేందుకు కేసును పునర్విచారణ చేయాలని హైకోర్టు ఈ ఏడాది జనవరిలో తెలిపింది. దానిని ఆయేషా మీరా తల్లిదండ్రులు స్వాగతించారు.

Please follow and like us:

You may also like...