ఆమ్నెస్టీ బాధితులకు అండగా….!

-నేడు 25 మంది తెలంగాణాకి రాక
-త్వరలో మిగతా వారందరు

మహేష్ బిగాల,నరసింహ నాయుడు,రషీద్,చిట్టి బాబుల బృందం
25 మంది కి విమాన టికెట్స్ కొనిచ్చి దగ్గరుండి తెలంగాణాకి పంపించారు.
తర్వాత షార్జాలో చెట్ల కింద నివాసముంటున్న చాల మందితో సమావేశమై వారి సమస్యలు తెలుసుకున్నారు.వారికీ కావాల్సిన అవుట్ పాసులు ఇప్పించి త్వరలో తెలంగాణాకి పంపించే ఏర్పాట్లు చేస్తామన్నారు.గల్ఫ్ బాధితులందరు సీఎం కెసిఆర్ కి,మంత్రి కేటీఆర్ గారికి ధన్యవాదాలు తెలిపారు.

షార్జాలోని ఒక భవనంలో మొదటి అంతస్థు నుండి కింద పడిన కొమరయ్య ను తెలంగాణాకి తెపిస్తామని కేటీఆర్ మాట ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వ బృందం కొమరయ్యను కలుసుకొని పాస్ పోర్ట్,అవుట్ పాస్ ఇపించి త్వరలో తెలంగాణాకి పంపిస్తామన్నారు.
ప్రభుత్వ బృందం తో పాటు గల్ఫ్ లోని పలు సంఘాలనాయకులు సామాజిక వేత్తలు ఇండియన్ పీపుల్స్ ఫోరం కన్వీనర్ జనగామ శ్రీనివాస్,గిరీశ్ పంత్,జనగామ బాల కిషన్,జువ్వాడి శ్రీనివాస్ రావు, నరేష్, నర్సింహా, సురేందర్, శేఖర్, శ్రీనివాస్, రమేష్ తదితరులు సహాయ చర్యలలో పాల్గొన్నారు.

Please follow and like us:

You may also like...