Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

ఆపరేషన్ బ్లూస్టార్…!

గడచిన నాలుగున్నర సంవత్సరాలలో ఈ రాష్ట్రంలో కేసీఆర్, ఆయన కుటుంబ అరాచకాలు, దుర్మార్గాలు, అక్రృత్యాల పై పోరాటం చేయడంలో వ్యవస్థలు సైతం కాడి పారేసిన పరిస్థితి చూశాం.
ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా భావించే మీడియా సైతం చేష్టలుడిగి మిగిలిపోయిన పరిస్థితి చూశాం.
ప్రలోభాలతో లొంగదీసుకోవడం…లొంగనివారిని అధికార మదంతో అణగదొక్కడం చూశాం.
ఇంతటి ప్రలోభాలు, ప్రతిబంధకాల మధ్య నాయకుడు రేవంత్ రెడ్డి ఒక్కడే ఎలాంటి రాజీ పడకుండా ఈ రాష్ట్ర ప్రజల కోసం కేసీఆర్ తో పోరాడుతున్నారు.

దీంతో రేవంత్ పై కేసీఆర్ అండ్ కో వ్యక్తిగత కక్ష పెంచుకున్నారన్నది చిన్న పిల్లవాడిని అడిగినా చెబుతారు.

ఆపరేషన్ బ్లూస్టార్ చేస్తానని అసెంబ్లీ సాక్షిగా రేవంత్ ను కేసీఆర్ హెచ్చరించిన సందర్భం ప్రజల కళ్ల ముందే ఉంది.

ఇదంతా చరిత్ర…రేవంత్ రెడ్డి లాంటి బలమైన ప్రజాధరణ ఉన్న నాయకుడు, కాంగ్రెస్ లాంటి విస్తృత వేదిక మీద నుంచి పోరాటం చేయడం…కేసీఆర్ కూసాలను కదలిస్తుందని వారికి భయం పట్టుకుంది.

ఆ క్రమంలోనే మోడీ కాళ్లు పట్టుకుని, టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ శాఖను కేసీఆర్ కు తాకట్టు పెట్టి రేవంత్ రెడ్డిని అడ్డు తొలగించుకునేందుకు కేసీఆర్ కుట్రపన్నారని అప్పట్లో ఆ నోటా ఈ నోటా గుసగుసలు.

ఓటుకు నోటు కేసుతో రేవంత్ ను ఏమీ చేయలేనని తేలిపోవడంతో…మోడీతో కలిసి ఐటీ, ఈడీలను రంగంలోకి దింపి కుట్రపూరితంగా రేవంత్ ను బధ్నాం చేయాలనుకుంటున్నారు.

ఈ కేసులో పూర్వాపరాలను ఓ సారి క్షుణ్ణంగా పరిశీలిస్తే ఇది రాజకీయకక్ష సాధింపుతో చేస్తున్న కుట్రపూరిత కేసని స్పష్టంగా అర్థమవుతుంది.

ఫిర్యాదు చేసిన రామారావు కు క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ ఉంది. అతనొక బ్లాక్ మెయిలర్ అన్నది స్పష్టంగా ఉంది. గతంలో భూ కబ్జాలకు పాల్పడి…రౌడీషీట్ కూడా ఓపెనై ఉంది.

ఇలాంటి వ్యక్తి ఫిర్యాదు చేస్తే…కనీస ఆధారాలు లేకుండా సీబీఐ, ఐటీ, ఈడీ లాంటి సంస్థలు ఓ జాతీయ పార్టీ రాష్ట్ర శాఖ వర్కింగ్ ప్రెసిడెంట్ స్థాయి నాయకుడు ఇళ్లపైకి వచ్చిందంటేనే…దీనివెనుక జరుగుతోన్న తతంగం ఏమిటో యిట్టె అర్థమవుతోంది.

సరైన ఆధారాలు లేవు, కోర్టుల ఆదేశాలు లేవు, ఫిర్యాదు చేసిన వ్యక్తికి క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్…అయినా రైడ్స్ జరిగాయంటే పొలిటికల్ మోటివేటెడ్ అన్నది ప్రజలకు అర్థం కాదనుకుంటున్నారా కేసీఆర్ వెళ్లి మోడీని కలుస్తాడు…మరుసటి రోజే ఓటుకు నోటు కేసులో కీలక మలుపు అని కథనాలు వస్తాయి…

గవర్నర్ ఢిల్లీ వెళ్లి రాగానే కేసీఆర్ వెళ్లి ఆయనను కలుస్తాడు…వెంటనే ఐటీ రైడ్స్ జరుగుతాయి…

జరుగుతున్న కుట్రకు ఇవన్నీ సర్కమస్టాన్షియల్ ఎవిడెన్సులు.

ఐటీ విచారణకు ఇంకా రేవంత్ హాజరుకాక ముందే భారీగా ఆస్తుల గుర్తింపు, మనీ లాండరింగ్, హవాలా లావాదేవీలను గుర్తించిన ఐటీ, ఈడీ అని మీడియాలో కథనాలు….ఆ కథనాల వెనుక ప్రగతి భవన్ డైరెక్షన్.

నిన్న మధ్యాహ్నం మూడు గంటల వరకు టీవీ ఛానళ్లు ఉన్నది ఉన్నట్టు ప్రసారాలు చేశాయి…సడెన్ గా నాలుగు గంటల నుంచి స్క్రీన్ మార్చేశాయి…రామారావు ఫిర్యాదు కాపీ పట్టుకుని ఐటీ, ఈడీలు శోధించిన విషయాలుగా ప్రోజక్షన్ ఇచ్చాయి…ఆ గంటలో ఏం జరిగింది? ప్రగతి భవన్ నుంచి వచ్చిన ఆదేశాలతో మీడియా యూ టర్న్ తీసుకున్నది నిజం కాదా!?

దాడుల గురించి రేవంత్ కు ముందే ఎలా తెలుసు అంటున్నారు….ప్రొసీజర్ ప్రకారం జరిగుంటే తెలిసేది కాదు…కుట్ర జరిగింది కాబట్టే విషయం బయటకు వచ్చింది. కేసీఆర్ అన్యాయాల పై పోరాడే రేవంత్ లాంటి వాడి హితం కోరేవారు కేసీఆర్ పక్కన కూడా ఉంటారు…అలాంటి వాళ్లే మాకు సమాచారం ఇచ్చారు.

మోడీ వచ్చాక ఐటీ, ఈడీ, సీబీఐ లాంటి సంస్థలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి…కేసులు ఎలా కట్టాలి, గిట్టని వారిపై ఉచ్చు ఎలా బిగించాలి…అంతా ఫ్యాబ్రికేటెడ్…ఇది దేశంలో ప్రజాస్వామ్యం వర్థిల్లుతున్న తీరు.

Please follow and like us:

You may also like...