ఆదుకున్న స్వచ్చంధ సేవా సమితి..!

  • నిరుపేద యువతి వివాహానికి ఆర్ధిక సహాయం
  • పెద్ద మనసుతో ముందుకొచ్చిన భక్త మార్కండేయ యువజన స్వచ్చంద సేవా సమితి
  • ఎంతో మంది అభాగ్యుల పాలిట పెద్ద దిక్కుగా సమితి సభ్యులు

జగిత్యాల/టౌన్ : వివరాల్లోకి వెళితే జగిత్యాల పట్టణం కు చెందిన భక్త మార్కండేయ యువజన స్వచ్చంద సేవా సమితి వారి ఆధ్వర్యంలో సోమవారం ఉదయం  జగిత్యాల మండలం మోరపెల్లి గ్రామానికి చెందిన నిరుపేద యువతి చిలుక మల్లవ్వ,లచ్చన్నల సంతానం,వారి కుమార్తె అయినటువంటి  నందిని వివాహమునకు భక్త మార్కండేయ యువజన స్వచ్ఛంద సేవా సమితి గౌరవ సలహా సభ్యులు మోర హనుమాండ్లు చేతుల మీదుగా 10వేల రూపాయల ఆర్థిక సహాయం  భక్త మార్కండేయ దేవాలయం లో అందజేయడం జరిగింది . ఈకార్యక్రమంలో పద్మశాలి సేవా సంఘం మాజీ ప్రధాన కార్యదర్శి మంచాల శ్రీనివాస్ , దుబ్బరాజన్న దేవాలయం పాలక మండలి సభ్యులు ఎలుగందుల రవి , వనమాల సహదేవ్ భాగ్యలక్ష్మి , భక్త మార్కండేయ యువజన స్వచ్ఛంద సేవా సమితి సభ్యులు,కార్యనిర్వాహకులు పాల్గొన్నారు .

Please follow and like us:

You may also like...