Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

ఆదుకున్న ఎపి సీఎం చంద్ర బాబు…!

అమరావతి/సచివాలయం: లుకేమియాతో బాధ పడుతున్న పద్నాలుగేళ్ళ బాలుడిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  దాతృత్వం చూపారు. లుకేమియాతో సతమతమవుతున్న జి.గిరీష్ చికిత్సకు రూ. 8 లక్షలను మంజూరు చేశారు. తూర్పు గోదావరిజిల్లా పి.గన్నవరం నియోజకవర్గంలోని మానేపల్లి గ్రామానికి చెందిన రాజేశ్వరి కుమారుడు గిరీష్ కొన్నాళ్ళుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. హైదరాబాద్ లోని రైన్ బో ఆసుపత్రిలోని డాక్టర్ శిరీష రాణి వద్ద జి.గిరీష్ కు చికిత్స జరిపిస్తున్నారు. లుకేమియా చికిత్సకు లక్షల్లో ఖర్చువుతున్నందున ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును రాజేశ్వరి వేడుకుంది. పేద కుటుంబమైన తమకు కుమారుడు గిరీష్ చికిత్స వ్యయం భరించలేని స్థితిలో దయతో ఆర్థికసాయం చేయాలని అర్థించింది. రాజేశ్వరి విజ్ఞప్తిని సావధానంగా విన్నముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు తక్షణం రూ. 8 లక్షలను ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి అందించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉదారతతో వ్యవహరించి కుమారుడి వైద్యఖర్చులను ప్రభుత్వం భరించడానికి ముందుకు వచ్చినందుకు, తమను కష్టాల నుంచి బయటపడే రీతిలో ఆదుకున్నందుకు రాజేశ్వరి కృతజ్ఞతలు తెలిపారు..

Please follow and like us:

You may also like...