ఆత్మగౌరవం ఐసీయూలో ఉంది విజయశాంతి…!

గద్వాల్‌: కేసీఆర్‌ పాలనలో తెలంగాణ రాష్ట్రంలో ఆత్మగౌరవం, ప్రజాస్వామ్యం ఐసీయూలో ఉన్నాయని తెలంగాణ కాంగ్రెస్‌ స్టార్‌ క్యాంపెయినర్‌ విజయశాంతి అన్నారు. గద్వాల్‌లో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌పైవిమర్శల వర్షం కురిపించారు.

సోనియాగాంధీ దగ్గరకు వెళ్లి నన్ను సీఎంను చేస్తే పార్టీని విలీనం చేస్తామని కేసీఆర్‌ చెప్పారు. కేసీఆర్‌ విజ్ఞప్తికి సోనియాగాంధీ ఒప్పుకోలేదు. తప్పులను కప్పిపుచ్చుకునేందుకు నాలుగున్నర ఏళ్లకే కేసీఆర్‌ ఎన్నికలకు వెళ్లారు’’ అని విజయశాంతి ఆరోపించారు. తెరాస నేతలు ఎన్నికల్లో డబ్బులు పంచి గెలవాలని చూస్తున్నారన్న విజయశాంతి వారి వద్ద డబ్బులు తీసుకుని ఓటు మాత్రం హస్తం గుర్తుపై వేయాలని కోరారు.

రాములమ్మ సినిమాలో రామిరెడ్డి స్థానంలో కేసీఆర్‌ ఉన్నారని మండిపడ్డారు. ‘‘ఉద్యమ సమయంలో ఉన్న కేసీఆర్‌ వేరు.. ప్రస్తుత కేసీఆర్‌ వేరు. సమైక్యవాదులతో కొట్లాడి ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నాం. తెలంగాణ వచ్చింది ఎస్సీ, ఎస్టీలకు కాదు దొరలకే. తెలంగాణ ప్రజలను నాలుగేళ్లుగా మోసం చేస్తున్నారు. మళ్లీ మోసం చేయాలని చూస్తున్నారు.

Please follow and like us:

You may also like...