ఆగిపోయిన యూట్యూబ్ సర్వీసులు…!

  • గుస్సా అయినా నెటిజన్లు…
  • ప్రపంచ నలుమూలల నుండి వెల్లువగా నెటిజన్ల ఫిర్యాదులు..
  • తక్షణమే స్పందించిన యూట్యూబ్ సంస్థ ప్రతినిధులు…

న్యూయార్క్ / న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత ప్రముఖమైనది,అలాగే మిలియన్ల మంది నెటిజన్ల ను ఉర్రూతలూగించే వీడియో స్ట్రీమింగ్‌ వెబ్‌సైట్‌ యూట్యూబ్‌ సేవలు అనుకోకుండా కొన్ని సాంకేతిక కారణాల వల్ల  బుధవారం(అక్టోబర్ 17) నిలిచిపోయాయి. అకస్మాతుగా ఏర్పడిన ఈ సాంకేతిక కారణాలతో ప్రపంచ వ్యాప్తంగా యూట్యూబ్‌ పనిచేయడం ఆగిపోయింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా నలుమూలలా ఉన్నటువంటి అనేక మంది నెటిజన్లు యూట్యూబ్‌, యూట్యూబ్‌ టీవీ, యూట్యూబ్‌ మ్యూజిక్‌లో తలెత్తిన సమస్యలను ఆ సంస్థ దృష్టికి తెలియజేశారు. దీనికి యూట్యూబ్ స్పందించింది. ఈ అసౌకర్యానికి చింతిస్తున్నామని, త్వరలో ఈ సమస్యను పరిష్కరించి, అప్‌డేట్‌ చేస్తామని యూట్యూబ్‌ సంస్థ ట్విట్టర్‌లో పేర్కొంది.

ఆ తర్వాత మరో ట్వీట్‌లో సమస్య పరిష్కారమైందని, మీ ముందుకు మళ్లీ వచ్చామని.. సహనంతో వేచిచూసినందుకు కృతజ్ఞతలు తెలిపింది.

  1. Team YouTube‏Verified account @TeamYouTube 4h4 hours agoMoreThanks for your reports about YouTube, YouTube TV and YouTube Music access issues. We’re working on resolving this and will let you know once fixed. We apologize for any inconvenience this may cause and will keep you updated.23,079 replies41,131 retweets107,674 likesReply 23K Retweet 41K Like 108K Direct message
  2. Team YouTube‏Verified account @TeamYouTube 3h3 hours agoMoreTeam YouTube Retweeted Team YouTubeWe’re back! Thanks for all of your patience. If you continue to experience issues, please let us know.Team YouTube added,Team YouTubeVerified account @TeamYouTubeThanks for your reports about YouTube, YouTube TV and YouTube Music access issues. We’re working on resolving this and will let you know once fixed. We apologize for any inconvenience this may cause and will keep you updated.1,075 replies2,688 retweets7,840 likesReply 1.1K Retweet 2.7K Like 7.8K Direct message

కాగా, అంతకుముందు, యూట్యూబ్‌ కంటెంట్‌ చూడాలని వెబ్‌సైట్‌లోకి వెళ్తే 500 ఇంటర్నల్‌ సర్వర్‌ ఎర్రర్‌, 503 నెట్‌వర్క్‌ ఎర్రర్‌ అని వస్తుందని నెటిజన్లు వాటికి సంబంధించిన స్క్రీన్‌ షాట్స్‌ను షేర్‌ చేశారు.

దీనితో పాటు అలాగే యూజర్స్‌కు వెబ్‌సైట్‌ లాగిన్‌ కావడం లేదని పేర్కొన్నారు. గత నెలలో ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌లు ప్రపంచ వ్యాప్తంగా కొన్ని ప్రదేశాల్లో ఇలాగే క్రాష్‌ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం 40నిమిషాల వ్యవధిలోనే యూట్యూబ్ సర్వీసులు పునర్ ప్రారంభం కావడంతో నెటిజన్లు ఆనందం వ్యక్తం చేశారు.

Please follow and like us:

You may also like...