అసెంబ్లీ మీడియా పాయింట్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీమంత్రి పెద్దిరెడ్డి….

మీడియా పాయింట్ లో మాట్లాడిన పెద్దిరెడ్డి, కెసిఆర్ ను దృష్టిలో ఉంచుకుని కొన్ని ప్రశ్నలను సంధించారు…..

4 సం. 3 నెలల 3 రోజులకి ఏ కారణం లేకుండా తెలంగాణా ప్రభుత్వం ఎందుకు రద్దు చేసినారు.

◆ సచివాలయం కు కూడా రాకుండా పరిపాలించినట్లు, ఎవరైనా జ్యోతిష్యులు చెప్పారేమో ఇప్పటివరకూ మాత్రమే కెసిఆర్ కు రాజయోగం ఉన్నదని పెద్దిరెడ్డి దుయ్యబట్టారు.

◆ సంపూర్ణ మెజారిటీ ఉన్నాకూడా ఏ కారణం వల్ల ఎన్నికలకు వెళ్తున్నది కెసిఆర్ ప్రజలకు చెప్పాలి.

◆ మొదటిసారి అవకాశం ఇస్తే 5 సం,, పరిపాలన చేయలేక ప్రభుత్వం రద్దుచేసి, మరలా ఏవిధంగా ఓట్లు అడుగుతావు?

◆ హామీలు నెరవేర్చలేక ప్రభుత్వం రద్దుచేశారు అనుకుంటున్నాం.

◆ 8 వ తారీఖున మా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు గారు హైదరాబాద్ రానున్నారు. ఆరోజు అక్కడ మా పార్టీ శ్రేణులు పార్టీ విధివిధానాలు గురించి మాట్లాడుకొనున్నాం. సాయంత్రం వరకు అక్కడే ఉండి ఎన్నికల వ్యూహరచన చేస్తామని చంద్రబాబు చెప్పారు.

◆సీపీఐ ,సీపీఎం ,తెలంగాణా జన సమితి ల నుండి పొత్తు ప్రతిపాదన వచ్చింది. కాంగ్రెస్ తో పొత్తు గురించి పత్రికల ద్వారా తెలిసింది, కానీ ఇప్పటివరకు ఎవరితో సంప్రదింపులు జరుపలేదు.

◆ పార్టీ శ్రేణులను, కార్యకర్తలను ఒప్పించి పొత్తులు ఖరారు చేసుకుంటాం.

◆ భస్మాసురుడు వలే తనకు తానే ఓడించుకోగల శక్తి కెసిఆర్ కు మాత్రమే ఉన్నది.

◆ ఎన్నికలకు మేము సిద్ధంగా ఉన్నాం, వచ్చే ఎన్నికలలో మేము ప్రభుత్వంలో ఉండి తీరతాం.

◆కెసిఆర్  ఇప్పటికే వారి అభ్యర్థులను ప్రకటించాడు కానీ వారికే  బీ ఫారం ఇస్తాడని చెప్పలేం.

◆ ఆంధ్రప్రదేశ్ లో కలసిన మూడు నియోజకవర్గాలకు సంబంధించిన 7 మండలాల విషయంలో, వాటిపరిది విషయంలో ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవాల్సివుంది, అటువంటి పరిస్థితి వస్తే ఎన్నికలు ఇప్పుడే జరగకపోవచ్చు.

◆ ఇప్పటివరకు ఒక ఎపిసోడ్ జరిగింది, రేపటినుండి ఎన్నికల సంఘం ఎపిసోడ్ జరుగనుంది, వాళ్ళ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.

Please follow and like us:

You may also like...