అల్లు శిరీష్ ఒక ఇంటివాడు అవబోతున్నాడ !

అల్లు శిరీష్ ఒకింటివాడవబోతున్నాడు. ఒకింటివాడు అవబోతున్నాడు అంటే పెళ్లి చేసుకోబోతున్నాడు అనుకోకండి. తాను నటించబోతున్న కొత్త సినిమా కోసం ఒక ఇల్లు తీసుకున్నాడు శిరీష్. “ఏబీసీడీ( అమెరికన్ బార్న్ కన్ఫ్యూజ్డ్) సినిమాను మలయాళంలో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ లో భాగంగా అల్లు శిరీష్ నివసించడానికి హైద్రాబాదులో ఒక ఇంటిని సెలెక్ట్ చేశారు.
ఈ విషయాన్నీ ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు అల్లు శిరీష్. మరో రెండు నెలలు నా ఇల్లు ఇదేనంటూ ఆ ఇంటికి సంబంధించిన వీడియోను అభిమానులతో పంచుకున్నాడు. ఈ సినిమాలో అల్లు శిరీష్, రుక్సార్ థిల్లాన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను మధుర శ్రీధర్, యష్ రంగినేని కలిసి నిర్మిస్తున్నారు. సంజీవ్ అనే యువ దర్శకుడు ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమవనున్నాడు.

Please follow and like us:

You may also like...