అర్ధరాత్రి తరువాత సర్కారు బస్సుల్లేవట…?

తెలంగాణ ప్రయాణీకులు కు ముఖ్య గమనిక…

హైదరాబాదు: తెలంగాణ ప్రజలు శనివారం అర్ధరాత్రి నుండి మొదలు ,ఆదివారం అర్థరాత్రి వరకు ఎక్కడికి వెళ్లొద్దని, వెళ్తే తిప్పలు తప్పవని తెలుస్తుంది.తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తలపెట్టిన ప్రగతి నివేదన సభ కొంగర కలాను చేర్చుటకు ప్రభుత్వ ప్రయివేటు వాహనాలను లెక్కకు మించి సభకు అధిక మొత్తం లో చేర్చడమే లక్ష్యం గా పెట్టుకోవడం తో, రాష్ట్రం లోని దాదాపు అన్ని డిపో లలో ఉన్న ప్రజా రవాణా వ్యవస్థ కు అందుబాటులో  ఉండే బస్సు లే సరిపోని స్థితి లో ఉన్న రాష్ట్రం మనది.

అయినా ఇదేదీ పట్టకుండా సభకు ఎక్కువ మొత్తం లో ఆర్టీసీ బస్సులు వాడుతుండటం తో, దీనితో ఉన్నఫళంగా పేద ప్రజల రవాణా వ్యవస్థ ఒక రోజు కుంటూ పడే దుర్గతి ఏర్పడినట్లు అయింది .కనుక దీనిని ప్రజలు దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ బస్సుల్లో, రవాణా వ్యవస్థ మీద ఆధారపడే వారు ప్రయాణాలు చేసే ముందు ఆలోచించి బయలుదేరండి.

Please follow and like us:

You may also like...