అరబ్ దేశం యూఏఈ లో వర్షాలు..!

బర్ దుబాయ్ ఏరియాలోని పాకిస్థాన్ కాన్సలేట్ నివాస ప్రాంతం

యూఏఈలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం శనివారం మధ్యాహ్నం కురిసింది. నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ మెటియరాలజీ సోషల్‌ మీడియా ద్వారా ఈ వివరాల్ని వెల్లడించింది. అల్ అజ్మన్లోని ముజైరాలో వర్షం కురిసింది. దీనికి సంబంధించి ఓ వీడియో కూడా విడుదల చేశారు. మసాఫి రీజియన్‌లోనూ వర్షం కురిసింది. యూఏఈలో వాతావరణం మామూలుగా వుంటుందనీ, ఈస్టర్న్‌ ఏరియాల్లో మేఘాలు కన్పిస్తాయని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ మెటియరాలజీ తెలిపింది. పలు చోట్ల గాలులు బలంగా వీచే అవకాశం వున్నందున డస్ట్‌ బ్లో అవుతుందని తెలిపిన ఎన్‌సిఎం, వాహనదారులు లో విజిబిలిటీ పట్ల అప్రమత్తంగా వుండాలని హెచ్చరించింది. రాత్రి వేళల్లో హ్యుమిడిటీ ఎక్కువగా వుంటుంది. అరేబియన్‌ గల్ఫ్‌, ఒమన్‌ సముద్రం ఓ మోస్తరు రఫ్‌గా వుండే అవకాశముంది.

Please follow and like us:

You may also like...