అయ్యప్ప గుడి ప్రవేశం లింగ వివక్ష ఉండొద్దు…సుప్రీం !

శబరిమల లో జోక్యం సబబు కాకపోవొచ్చు 

సుప్రీం కోర్ట్ తీర్పు పై పునః పరిశీలన చేయాలి . 

ప్రజాస్వామ్య వ్యవస్థ లో సర్వోత్తమ న్యాయస్థానం తీర్పు గౌరవించాల్సిందే,
కానీ  ఆచార వ్యహారం లో కోర్ట్ ఇలా స్పందించడం, ప్రజాస్వామ్య వ్యవస్థలో సరైంది కాదేమో?

పూర్వం మన పెద్దలు ఎంతో నియమ నిష్ఠ లతో కఠిన మైన దీక్ష ,కఠిన యాత్ర లో ఇలాంటి నిషేధ ఆంక్షలు పెట్టడం అంటే ఏదో బలమైన కారణం, దేవ రహస్యం ఉండొచ్చు, వ్యవస్థ పరం గ మనం కోర్ట్ లో చెప్పుకోలేని అంశాలు ,చూపలేని సాక్ష్యాలు ఇమిడి ఉండొచ్చు .

ఎన్నో ఏండ్లు గా ఆచార వ్యవహారం గ వస్తుంది . అసలు ఈ కోర్ట్ కి ఎక్కినవాలు దైవ భక్తులైన ,వారికి అయ్యప్ప స్వామి మీద భక్తి తో చేస్తున్నారా ? లేక ఇది కూడా ఒక హక్కు సాధన గా భావిస్తున్నారా ?

స్వతంత్రం వచ్చినప్పటి నుండి కేరళ లో పాలించిన కమ్యూనిస్ట్ ,కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏనాడూ దేవస్థానం ఆచార వ్యవహారాల్లో తలదూర్చలేదు , కమ్యూనిస్ట్ ,కాంగ్రెస్ ప్రభుత్వాల్లో దేవస్థానం సంబంధిత ఏ చిన్న అంశం పై కూడా తుది నిర్ణయాన్ని పూర్తిగా దేవస్థానం ట్రస్ట్ కె వదిలేవారు 
గత ప్రభుత్వాలలో ఎంతోమంది హై కోర్ట్ ను సంప్రదించినా దేవస్థాన ఆచార వ్యవహారాల్లో మేము తలదూర్చాము అని నిర్దందం గా తోసి పుచ్చింది.
మకర జ్యోతి పై ,పంపానది కాలుష్యం అంటూ ఎంతోమంది ప్రభుత్వాలను కోర్ట్ లను ఆశ్రయించినా ఏనాడూ పట్టించుకోలేదు దేవస్థానం నియమాలు ఫైనల్ అని చెప్పేవి.
కమ్యూనిస్ట్ ,కాంగ్రెస్ ప్రభుత్వాల్లో మహిళా కలెక్టర్ ల ద్వారా నిరంతరం నిఘా పెట్టి నిషేధ ఆజ్ఞల పై పని చేసి ఆలయ ఆచారం కాపాడటం చేశాయి

సుప్రీం కోర్ట్ పునః పరిశీలన చేయాలి

ప్రతి జాతి ఆచార వ్యవహారాలు రక్షించుకుందాం అని రాజ్యాంగం లో రాసుకున్నాం ,బహుషా దక్షిణాది ఆచార వ్యవహారాలు ఉత్తరాది వారు అర్థం చేసుకోలేక పోయారా అన్నది జవాబు లేని ప్రశ్న గా మిగిలిపోయిందనుకుంటున్న సామాన్య ప్రజలు.

Please follow and like us:

You may also like...