అమెరికాలో రోడ్డు ప్రమాదం గీతం అధినేత దుర్మరణం….!

వైజాగ్ / అమెరికా/ కాలిఫోర్నియా : అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం లో గీతం అధినేత, తెలుగు దేశం ఎమ్మెల్సీ శ్రీ ఎంవీవీఎస్ దుర్మరణం పాలయ్యారు. అమెరికా కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం కాలిఫోర్నియా నుంచి అలాస్కాలోని ఆంకరేజి సఫారీని చూసేందుకు వెళుతున్న సందర్భం లో మార్గమధ్యం లో ఈ దుర్ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తున్నది.

లాస్ ఏంజెల్స్ నుంచి అలస్కాకు వాహనంలో వీరు బయలుదేరి వెళుతుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం తెలుస్తున్నది. ప్రమాద సమాచారం తెలుసుకున్న వెంటనే తానా సభ్యులు ఘటనా స్థలానికి చేరుకొని హుటాహుటిన ప్రథమ చికిత్స కోసం అంబులెన్సు లో తానా సభ్యులు తరలించినట్లు తెలుస్తున్నది. ప్రమాదంలో ఎంవీవీఎస్‌ మూర్తితో పాటు బసవపున్నయ్య వెలువోలు,ప్రసాద్ వీరమాచినేని,వెంకటరత్నం కడియాల, చిన్నాగా మృతి చెందినవారుగా గుర్తించారు.

వీరిలో ఇద్దరు లాస్ ఏంజిల్స్‌కు చెందిన ఎన్ఆర్ఐలు ఉన్నట్లు తెలుస్తున్నది, వీరంతా వైల్డ్ లైఫ్ సఫారీ చూసేందుకు అలస్కా వెళుతుండగా ఈ ప్రమాదానికి గురైనట్లు తెలిసింది.

గీతం’ యూనివర్శిటీ అధినేత, టిడిపి ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి మరణం టీడీపీకే కాదు వ్యక్తిగతం గాను చంద్రబాబు కుటుంబానికి నష్టమే.అదెలాగంటే చంద్రబాబు వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ, రెండో కుమార్తెను ఎంవీవీఎస్ మూర్తి మనమడికి ఇచ్చి పెళ్లి చేశారు.

అంటే బాలయ్య వియ్యంకుడి తండ్రే ఈయన. ఇంకా చెప్పాలంటే నారా లోకేష్ కు స్వయానా తోడల్లుడే ఈ ఎంవివిఎస్ మూర్తి మనమడు భరత్….

ఆ విధంగా ఇటీవలే హరికృష్ణను రోడ్డుప్రమాదంలో కోల్పోయిన నందమూరి కుటుంబానికి ఇటు చంద్రబాబుకు, అలాగే టిడిపికి ఇది మరో దురదృష్టం. మూర్తికి మరో రాజకీయ నాయకునితో కూడా దగ్గర సంబంధం ఉంది.సీనియర్ నాయకుడైన మాజీ కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావుకు ఈ మూర్తి స్వయానా వియ్యంకుడు కూడా అవ్వడం కొసమెరుపు.

Please follow and like us:

You may also like...