Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

అమరావతిలో గ్రాఫిక్స్ తప్ప ఏం లేదు అన్న ప్రశ్నకు సబ్బంహరి సమాధానం

మనం ఒక ఇళ్ళు కట్టాలంటే స్థలంకొని, ప్లాన్ అప్రూవల్ తీసుకుని కట్టడానికి రెండేళ్లు పడుతుంది.

విజయవాడ/బ్యూరో: అమరావతి పైన అవాకులు చెవాకులు మాట్లాడే వారికి సబ్బం హరి చురకలు అంటించారు. ఈ నేపధ్యం లో ఆయన మాట్లాడుతూ ఐదు కోట్ల ప్రజల కోసం కట్టే రాజధానికి కొంచెం సమయం పట్టడంలో తప్పులేదు, 35 వేల ఎకరాలు సేకరించి, ప్రజలకు ఏ ఇబ్బందులు లేకుండా చేయడం లోనే చంద్రబాబు విజయం సాధించాడు.

ప్రతిపక్షాలు కోర్టులో కేసులు వేయడం వల్ల రెండేళ్లు ఆలస్యం అవ్వడం, కేంద్రం మద్దతు ఇవ్వకపోయినా ఎక్కడ ఏ ఉబ్బంది లేకుండా కడుతున్నారు.

ఇప్పటి అవసరాలకు తాత్కాలిక రాజధాని కట్టుకుంటా, కట్టుదిట్టమైన రాజధాని కడుతున్నాడని ఆయన ఈ సందర్బంగా అన్నారు. నిన్న వచ్చిన హై కోర్టు న్యాయ మూర్తులు కూడా మెచ్చుకున్నారని గుర్తుచేశారు. అమరావతికి ఎవరు  అడ్డు పడినా ఆగే సమస్యే లేదని అటువంటి పనులు చేసి అభాసుపాలు కావొద్దని చెప్పకనే చెప్పారు.

Please follow and like us:

You may also like...