అబుదాబీ రోడ్డు ప్రమాదంలో డ్రైవర్‌ మృతి…!

అబుదాబీలో రెండు ప్రమాదాలు చోటు చేసుకోగా ఓ ప్రమాదంలో వాహన డ్రైవర్‌ ప్రాణాలు కోల్పోయాడు. మరో ఘటనలో ఆరుగురు వ్యక్తులకు గాయాలయ్యాయి. ఈ రెండు ఘటనల్లోనూ పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. రస్‌ అల్‌ ఖైమా ట్రాఫిక్‌ అండ్‌ పెట్రోల్స్‌ డిపార్ట్‌మెంట్‌ – అబుదాబీ ట్రాఫిక్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎక్సటర్నల్‌ ఏరియాస్‌ డిప్యూటీ డైరెక్టర్‌ లెఫ్టినెంట్‌ కల్నల్‌ డాక్టర్‌ అబ్దుల్లా యూసుఫ్‌ అల్‌ సువైది మాట్లాడుతూ, వాహనదారులు సేఫ్‌ డిస్టెన్స్‌ పాటించకపోవడంతోనే ఈ ప్రమాదాలు జరిగినట్లు చెప్పారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వాహన డ్రైవర్‌ మృతదేహాన్ని ఆసుపత్రి మార్గ్యూకి తరలించారు. గాయపడ్డవారికి ఆసుపత్రిలో వైద్య చికిత్స అందిస్తున్నారు. 

Please follow and like us:

You may also like...